Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్ పంటపండిది... గాయంతో విజయ్ శంకర్ ఔట్...

Webdunia
సోమవారం, 1 జులై 2019 (15:53 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడగా, ఒక మ్యాచ్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఐదు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. ఫలితంగా మొత్తం 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. 
 
ఇంతవరకుబాగానే ఉన్న భారత క్రికెట్ జట్టుకు గాయాల బెడద మాత్రం తప్పలేదు. ఇప్పటికే డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి  బొటనవేలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అలాగే, ప్రధాన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా తొడగాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 
 
ఈ క్రమంలో తాజాగా నాలుగో నంబర్ ఆటగాడిగా జట్టుకు సేవలు అందిస్తున్న విజయ్ శంకర్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విజయ్ శంకర్ గాయపడ్డారు. ఫలితంగా విజయ్ ఫీల్డింగ్ చేయలేక డ్రెస్సింగ్ రూమ్‌కు పరిమితమయ్యాడు. అతని స్థానంలో రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు. 
 
విజయ్ శంకర్ స్థానాన్ని కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా కోరిక మేరకే మయాంక్‌ను ఇంగ్లాండ్ పంపిస్తున్నట్టు తెలుస్తోంది. మయాంక్ వస్తే ఓపెనింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ తన పాత స్థానమైన నం.4లో ఆడతాడు. ఇప్పుడాస్థానంలో ఆడుతున్న రిషబ్ పంత్‌కు మరో అవకాశం ఇచ్చి, అతను గనుక విఫలమైతే అతడి స్థానంలో మయాంక్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్నది టీమిండియా ప్లాన్! మయాంక్‌ను ఓపెనర్‌గా పంపితే, రాహుల్ నం.4 స్థానంలో బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

ప్రియురాలితో శృంగారం.. పురీష నాళంలో 20 సెం.మీ వైబ్రేటర్.. ఎలా?

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

తర్వాతి కథనం
Show comments