Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్‌లో ప్రస్తుతం సెమీఫైనల్ సమీకరణాలు ఎలా వున్నాయంటే?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (19:04 IST)
1. ఏడు పోటీల్లో 11 పాయింట్లతో మిగిలిన ఐదు జట్లలో భారత్ స్థానం మెరుగ్గా వుంది. సెమీఫైనల్లో స్థానం దక్కించుకోవడానికి మిగిలిన రెండు పోటీల్లో బంగ్లాదేశ్‌తో (జూలై 2వ తేదీ), శ్రీలంకతో (జూలై 6వ తేదీ) భారత్ తలపడాల్సి వుంది. ఇంకా మెన్ ఇన్ బ్లూకు ఒక పాయింట్ అవసరం.


శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు పాయింట్లు తక్కువగా వున్నప్పటికీ పటిష్టమైన ఎన్ఆర్ఆర్ పద్ధతి వారిని సెమీస్‌కు తీసుకెళ్లే అవకాశాలున్నాయి. కాబట్టి బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆడాల్సి వుంటుంది. 
 
2. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆడి 11 పాయింట్లతో, న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడి సెమీఫైనల్ అర్హత సాధించాల్సి వుంది. అయితే బ్లాక్ క్యాప్స్‌ 200 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించినట్లైతే, పాకిస్థాన్ బంగ్లాదేశ్‌ను భారీ పరుగుల తేడాతో ఓడించినట్లైతే అంచనాలు తలకిందులవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఆర్ ద్వారా పాకిస్థాన్ సెమీఫైనల్లోకి ప్రవేశించే అవకాశం వుంది.  
 
3. ఇక ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌ను గ్రూప్ స్టేజ్ టైలో ఓడిస్తే.. సెమీఫైనల్లోకి ప్రవేశిస్తుంది. అయితే ఇంగ్లండ్ ఓడిపోతే, ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌‌ను ఓడించేందుకు బంగ్లాదేశ్‌ను, బంగ్లాదేశ్‌ను ఓడించేందుకు భారత్‌తో తలపడాల్సి వుంటుంది.  
 
4. పాకిస్థాన్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకునేందుకు బంగ్లాదేశ్‌ను భారీ పరుగుల తేడాతో ఓడించాల్సి వుంటుంది. ఇంగ్లండ్ కివీస్ చేతిలో ఓడితే ఇంకా మార్గం సుగమమవుతుంది. 
 
5. ఇప్పటికే ఏడు పాయింట్లతో వున్న బంగ్లాదేశ్, మరో రెండు మ్యాచ్‌ల్లో భారత్, పాకిస్థాన్ జట్లను మట్టికరిపించాల్సి వుంటుంది. అంతేగాకుండా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్టును ఓడిస్తుందని ఎదురుచూస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments