Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యారీ దవడకు గాయం.. కట్టుకట్టుకుని బ్యాటింగ్.. కుంబ్లే గుర్తొచ్చాడు.. (video)

Webdunia
గురువారం, 11 జులై 2019 (17:48 IST)
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ల మధ్య ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో సెమీపైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.


దీంతో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియా ఆదుకునేందుకు ఐదో స్థానంలో క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు. కానీ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతి ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ గాయపడ్డాడు. 
 
క్యారీ హెల్మెట్‌ను బలంగా తాకడంతో.. క్యారీ దవడకు తాకి నోటి వెంట రక్తం కారింది. దీంతో మ్యాచ్‌ను కాసేపు ఆపేశారు. కానీ ప్రాథమిక చికిత్స తర్వాత క్యారీ బ్యాటింగ్ కొనసాగించాడు. రక్తం కారుతున్న చోట ప్లాస్టర్ వేసుకుని మరీ బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ ఆ గాయం బాగా లోతుగా తగలడంతో రక్తస్రావం అవుతూనే ఉండడంతో మరోసారి మెడికల్ టీమ్‌ను మైదానంలోకి పిలిపించుకున్న క్యారీ తలమీదుగా పెద్ద కట్టు కట్టించుకున్నాడు. 
 
అయినా రక్తం కారుతూనే వున్నా మొండి పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. అయితే క్యారీ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అదిల్ రషీద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అప్పట్లో భారత స్టార్ ప్లేయర్ అనిల్ కుంబ్లే వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో తలకు కట్టుతో ఇలాగే ఆడి పోరాటపటిమను చాటిన సంఘటన క్యారీ గాయంతో మళ్లీ అందరూ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు క్రికెట్ జనం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments