Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్ ట్రోఫీ : శ్రీలంక చేతిలో భారత్ చిత్తు... కోహ్లీ సేనకు సెమీస్ బెర్త్ అందని ద్రాక్షేనా? ఎలాగంటే?

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత కుర్రోళ్లు నిర్ధేశించిన 322 పరుగుల భారీ విజయలక్ష్యా

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (14:01 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత కుర్రోళ్లు నిర్ధేశించిన 322 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని లంకేయులు అజేయంగా ఛేదించారు. దీంతో గ్రూపు-బిలో సెమీస్ బెర్త్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ గ్రూప్‌లోని నాలుగు జట్లూ రెండేసి పాయింట్లతో సమానంగా ఉండటంతో సెమీస్ బెర్త్ ఉత్కంఠగా మారింది.
 
లండన్‌లోని ఓవెల్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ నిర్ధేశించిన 322 పరుగుల విజయలక్ష్యాన్ని శ్రీలంక జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో గ్రూప్-బి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు వెళ్లే రెండు జట్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. గ్రూప్‌లోని నాలుగు జట్లూ రెండేసి పాయింట్లతో ఉండటమే ఈ ఉత్కంఠకు కారణం. 
 
పైగా, ఈ గ్రూపులో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. ఆదివారం భారత్, దక్షిణాఫ్రికాల మధ్య, సోమవారం శ్రీలంక, పాకిస్థాన్ నడుమ మ్యాచ్‌లు జరగాల్సి వున్నాయి. ఇక్కడ భారత్‌కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటంటే, పాకిస్థాన్‌పై సాధించిన మెరుగైన విజయంతో రన్ రేట్‌లో మిగతా మూడు జట్ల కన్నా ముందు నిలవడమే.
 
ఈ విషయాన్ని పక్కనబెడితే కోహ్లీ సేన సెమీస్‌లో అడుగుపెట్టాలంటే ఆదివారం సఫారీలతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించాల్సి ఉంది. అపుడే సెమీస్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా వెళుతుంది. ఆపై శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్‌లో గెలిచే జట్టు దక్షిణాఫ్రికాను ఇంటికి పంపి సెమీస్‌కు అర్హత పొందుతుంది. 
 
ఇదిలావుంటే, ఈ సిరీస్‌కు వరుణ దేవుడు పదేపదే అడ్డంకి కలిగిస్తున్నాడు. ఒకవేళ దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మ్యాచ్ రద్దయితే భారత్ సెమీస్‌కు వెళుతుంది. ఎందుకంటే, మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ సాధించడం, మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా లంక, పాక్‌ల మ్యాచ్‌లో ఎవరు గెలిచినా, వారితో పాటు సెమీస్‌కు స్థానం పొందుతుంది. 
 
ఒకవేళ ఈ మ్యాచ్ కూడా రద్దయినా, భారత్‌కు వచ్చే నష్టముండదు. కానీ, దక్షిణాఫ్రికా గెలిస్తే మాత్రం భారత్‌ ఇంటికి పయనం కావాల్సిందే. అంటే దక్షిణాఫ్రికాపై తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో ఆదివారం భారత జట్టు బరిలోకి దిగనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments