Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chahal: హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ హార్ట్‌బ్రేక్ క్లబ్‌లో చాహల్.. కరోనా టైమ్‌లో ప్రేమ ప్రారంభమైంది.. చివరికి?

సెల్వి
బుధవారం, 8 జనవరి 2025 (12:55 IST)
Chahal
సిక్స్‌లు, వికెట్లు, చివరి నిమిషంలో  అద్భుత ఆటతీరుతో క్రికెటర్లు జట్టును కాపాడే సన్నివేశాలెన్నో వున్నాయి. సాధారణంగా క్రికెటర్లు అంటే అభిమానులు పడి చస్తారు. వారి కెరీర్ సంగతి మాత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంటే... ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలు తరచుగా ముఖ్యాంశాలుగా నిలుస్తున్నాయి.

క్రికెటర్ల ప్రేమకథలు తరచుగా అద్భుత కథలుగా అనిపిస్తాయి. తాజాగా యుజ్వేంద్ర చాహల్ వ్యవహారం క్రికెట్ ప్రపంచంలో టాక్ ఆఫ్ ది స్టోరీగా నిలిచిపోయింది. తన వేగవంతమైన డెలివరీలకు పేరుగాంచిన ఈ స్పిన్నర్ అతని భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకోనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

క్రికెట్ ప్రపంచంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ హార్ట్‌బ్రేక్ క్లబ్‌లో హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ కూడా భాగమయ్యారు. ఒకప్పుడు మీడియాకు వ్యక్తిగత జీవితాలు జాగ్రత్త కథలుగా మారిపోయాయి. నటాసా స్టాంకోవిచ్ నుండి హార్దిక్ విడిపోవడం అందరికీ షాకిచ్చింది.

ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ అదే పడవలో ఉన్నాడు. ధనశ్రీతో విడిపోయాడనే గుసగుసలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, ఇప్పుడు యుజువేంద్ర చాహల్ వీరంతా వైవాహిక పోరాటాలను ఎదుర్కొంటున్నారు. "విడాకుల క్లబ్"లో చాహల్ చేరిపోతాడా అనేది తెలియాల్సి వుంది. భారీ ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఈ జంట విడిపోవడాన్ని బహిరంగంగా ధృవీకరించలేదు.

యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ లవ్ స్టోరీ

యుజ్వేంద్ర చాహల్ మరియు ధనశ్రీ వర్మ లవ్ స్టోరీ టైమ్‌లైన్ యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మ మధ్య ప్రేమకథ 2020లో COVID-19 లాక్‌డౌన్ పరిస్థితులలో ప్రారంభమైంది. చాహల్‌తో సహా క్రికెటర్లు ఆడటానికి మ్యాచ్‌లు లేకుండా ఇంట్లో ఇరుక్కుపోయారు. అప్పుడే ధనశ్రీ డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో చూసి ప్రేమలో పడ్డాడు.

ఆగస్ట్ 8, 2020న, ఈ జంట తమ నిశ్చితార్థాన్ని ప్రకటించింది. డిసెంబర్ 22, 2020న వీరి వివాహం జరిగింది.  ధనశ్రీ ఐపిఎల్ మ్యాచ్‌లలో స్టాండ్స్ నుండి చాహల్‌ను ఉత్సాహపరిచింది. 2024లో, వైవాహిక విభేదాల పుకార్లు రావడం ప్రారంభించాయి. చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ నుండి ధనశ్రీ అన్ని ఫోటోలను తొలగించినట్లు అభిమానులు గమనించినప్పుడు ఊహాగానాలు తీవ్రమయ్యాయి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments