Webdunia - Bharat's app for daily news and videos

Install App

యశస్వి జైస్వాల్ అదుర్స్.. 12 సిక్సర్లతో వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్ బ్రేక్

సెల్వి
శనివారం, 24 ఫిబ్రవరి 2024 (22:25 IST)
Yashasvi Jaiswal
స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన టాప్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించిన యశస్వి.. 16 ఏళ్ల క్రితం భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన రికార్డును సులువుగా బద్దలు కొట్టాడు. 
 
యశస్వి జైస్వాల్ ఇప్పుడు 2024లో టెస్టు క్రికెట్‌లో 23 సిక్సర్లు కొట్టాడు. తద్వారా 2008లో సెహ్వాగ్ కొట్టిన 22 సిక్సర్ల రికార్డును, 2022లో రిషబ్ పంత్ రికార్డును అధిగమించాడు.
 
16 ఏళ్ల కిందటే అంటే 2008లో భారత్ తరఫున ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. ఆ ఏడాది సెహ్వాగ్ 14 టెస్టుల్లో 22 సిక్సర్లు బాదాడు.
 
అయితే తాజాగా 2024లో యశస్వి జైస్వాల్ తన ఐదో టెస్టులో సెహ్వాగ్ 22 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఐదో టెస్టులోనే యశస్వి ఈ ఘనత సాధించాడు. 
 
రిషబ్ పంత్ 21 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. పంత్ 2022లో ఈ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (19 సిక్సర్లు, 2019), మయాంక్ అగర్వాల్ (18 సిక్సర్లు, 2019) ఉన్నారు. తాజా ఇన్నింగ్స్‌లో యశస్వి 117 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేశాడు.
 
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో యశస్వి జైస్వాల్ ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లి, వినోద్ కాంబ్లీ తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రాజ్‌కోట్ డబుల్ సెంచరీలో యశస్వి 12 సిక్సర్లు బాదాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

తర్వాతి కథనం
Show comments