Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ : టార్గెట్ 557 రన్స్... ఓటమి దిశగా ఇంగ్లండ్

england players

వరుణ్

, ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (16:31 IST)
రాజ్‍‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు ఓటమి దిశగా సాగుతుంది. భారత తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన పరుగులతో కలుపుకుని ఇంగ్లండ్ జట్టు ముగింట 557 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 24.2 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు క్రౌలీ 11, డక్కెట్ 4, పోప్ 3, రూట్ 7, బైర్‌స్టో 4, స్టోక్స్ 15 చొప్పున పరుగులు చేయగా, అహ్మద్ డకౌట్ అయ్యాడు. అయితే, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లేలు 16 చొప్పున పరుగులతో క్రీజ్‌లో ఉన్నాు. ఈ టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు జట్టు స్కోరును వంద పరుగుులకు దాటించేలా ఉన్నారు. క్రీజ్‌లో నింపాదిగా ఆడుతూ, ఇప్పటికే 32 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా ఒక వికెట్ చొప్పున తీశాడు. డక్కెట్ రనౌట్ అయ్యాడు. 
 
అంతకముందు, ఈ మూడో టెస్ట్ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేశారు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌ల సాయంతో 214 పరుగులు చేశాడు. అతడితోపాటు శుభ్‌మన్ గిల్ (91), సర్ఫరాజ్‌ ఖాన్ (68 నాటౌట్) హాఫ్‌ సెంచరీలు చేశారు. దీంతో భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ ఎదుట భారత క్రికెట్ జట్టు 557 పరుగులు భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 319 రన్స్‌కే ఆలౌటైంది. భారత్‌కు 126 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.
 
కాగా, మూడో రోజు ఓవర్‌నైట్‌ 196/2 స్కోరుతో నాలుగో రోజును ప్రారంభించిన భారత్‌ దాదాపు గంటపాటు వికెట్ కోల్పోలేదు. కానీ, కుల్‌దీప్‌తో (27)  సమన్వయలోపం కారణంగా శుభ్‌మన్‌ గిల్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. వెన్ను నొప్పి కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌ ప్రకటించిన యశస్వి మళ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే దూకుడుగానే ఆడాడు. అయితే, మరికాసేపటికే నిలకడగా ఆడిన కుల్‌దీప్‌ ఔటయ్యాడు. దాదాపు 15 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉండటం విశేషం. 258/4 స్కోరుతో ఉన్న సమయంలో యశస్వికి తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్‌ జతకలిశాడు. 
 
ఇంగ్లాండ్‌కు బజ్‌బాల్‌ క్రికెట్ రుచి చూపిస్తూ బౌండరీలతో హోరెత్తించారు. కేవలం 26 ఓవర్లలోనే ఐదో వికెట్‌కు 172 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యశస్వి తన కెరీర్‌లో రెండో డబుల్‌ సెంచరీ, సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఇంగ్లండ్‌ ఎదుట లక్ష్యం 550+ దాటడంతో భారత సారథి రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసినట్లు ప్రకటించాడు. 
 
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆసీస్‌ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (855) ఉన్నాడు. 
 
భారత్‌ ప్రతి ఇన్నింగ్స్‌లోనూ 400+ స్కోరు చేయడం ఇది మూడోసారి. 2005లో పాక్‌పై (407, 407/9), 2009లో శ్రీలంకపై (426, 412/4) సాధించింది. 
 
ఒక సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన తొలి జట్టుగా తన రికార్డునే భారత్‌ అధిగమించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 48 సిక్స్‌లను భారత్ కొట్టింది. అంతకుముందు దక్షిణాఫ్రికాపై 47 సిక్స్‌లు బాదారు. 
 
భారత్‌ తరపున టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు.  ఇంతకుముందు గంగూలీ (535) పేరిట ఉన్న రికార్డును యశస్వి (545) అధిగమించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ : ఇంగ్లండ్ ముంగిట 557 విజయలక్ష్యం