ఐపీఎల్ వేలంలో నన్నెందుకు పక్కనబెట్టారయ్యా.. నేనేం తప్పు చేశానో?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (11:15 IST)
ఐపీఎల్‌లో తననెందుకు పక్కనబెట్టారంటూ టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ అడిగాడు. రాజస్థాన్ వేదికగా ఐపీఎల్ 12వ సీజన్ కోసం వేలం పాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలం పాటలో తనను ఫ్రాంచైజీలు శుభ్రంగా మరిచిపోయాయని.. ఇంతకీ తనను విస్మరించే రీతిలో తానేం తప్పు చేశానో తనకు తెలియట్లేదని మనోజ్ తివారీ అన్నాడు. 
 
దీంతో మనస్తాపం చెందిన మనోజ్ తివారీ.. తనను కొనుగోలు చేయకపోవడానికి గల కారణం ఏమిటని ట్విట్టర్‌లో ప్రశ్నించాడు. అంతేగాకుండా మనోజ్ తివారీ తాను సాధించిన రికార్డులను, ట్రోఫీలను కూడా షేర్ చేశాడు. 
 
భారత్ తరపున సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన తర్వాత వరుసగా 14 మ్యాచ్‌లలో తప్పించారని.. 2017 ఐపీఎల్‌లో సాధించిన అవార్డులను చూస్తుంటే.. ఏం తప్పు చేశానో తనకు తెలియట్లేదన్నాడు. 
 
దీనిపై నెటిజన్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలను తప్పుబడుతున్నారు. క్రేజున్న ఆటగాళ్లే కాకుండా రికార్డులున్న.. మైదానంలో రాణించగలిగే సత్తా వున్న క్రికెటర్ల పట్ల ఫ్రాంచైజీలు ఎందుకు దృష్టి పెట్టలేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సార్, రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తామని రూ.7 కోట్లు తీసుకున్నారు: బాబుకి టీడిపి కార్యకర్త వీడియో

రిపోర్ట్ వచ్చేవరకూ ఆ 2000 కోళ్లను ఎవ్వరూ తినొద్దు

మనిద్దరి మధ్య మా ఆయన అడ్డుగా వున్నాడు, చంపేయ్: ప్రియుడితో వివాహిత

ట్రంప్ మళ్లీ కొత్త మెలిక: మధుమేహం, ఊబకాయం వుంటే వీసా రిజెక్ట్

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

తర్వాతి కథనం
Show comments