Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాహల్ దెబ్బకు తుర్రుమని పారిపోయిన ధోనీ... (video)

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (09:48 IST)
భారత క్రికెట్ జట్టు యువస్నిన్నర్ యజ్వేంద్ర చాహల్. అతని దెబ్బకు భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పారిపోయాడు. అదీ కూడా అలా ఇలా కాదు.. తుర్రుమని మెరుపు వేగంతో పారిపోయి డ్రెస్సింగ్ రూమ్‌లో చేరిపోయాడు. ఇంతకు ఓ యువ బౌలర్ దెబ్బకు ధోనీ పారిపోవడానికిగల కారణం ఏంటో తెలుసుకుందాం. 
 
సాధారణంగా ఎలాంటి మీడియా సమావేశమైనా సరే, ఎంతటి క్లిష్టమైన ప్రశ్నకు అయినా సరే ఏమాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పే వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ. అలాంటి ధోమీ.. మీడియాను చూసి పారిపోయాడు. అదీ కూడా చాహల్ దెబ్బకు. 
 
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో భారత క్రికెట్ చివరి వన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో టీమిండియా యువ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ తన 'చాహల్‌ టీవీ'తో మాట్లాడాల్సిందిగా ధోనీ ముందు మైక్‌ పెట్టాడు. 
 
ఇందుకు ధోనీ నిరాకరించాడు. అయినా, మాట్లాడాల్సిందేనంటూ చాహల్‌ బలవంతం చేయబోవడంతో, సరదాకో, సీరియ్‌సగానో తెలియదు గానీ.. ధోనీ అక్కడి నుంచి తప్పించుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌పైపు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

తర్వాతి కథనం
Show comments