Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మమ్ముట్టి నటనకు ఫిదా... పెరంబు చూస్తే...

Advertiesment
Mammooty
, సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (17:26 IST)
67 సంవత్సరాల వయస్సులో కూడా యాక్టింగ్‌తో అందరి ప్రశంసలు అందుకుంటూ, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి. మూడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకుని, చలనచిత్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నాడు. మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా యువ నటుడుగా రాణిస్తున్నాడు. గతేడాది వచ్చిన మహానటి చిత్రంలో జెమిని గణేశన్ పాత్రలో ఒదిగిపోయి నటించి అందరి మన్నలను అందుకుని, తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. 
 
తెలుగులో రెండు చిత్రాల్లో నటించిన మమ్ముట్టి ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి 2003లో చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న 'యాత్ర' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క మమ్ముట్టి తమిళంలో నటించిన 'పేరన్బు' అనే చిత్రం గత వారం విడుదలై ప్రేక్షకులతో పాటు విశ్లేషకుల మన్నలను అందుకుంది. 
 
ఈ చిత్రంలో మమ్ముట్టి ఒక దివ్యాంగురాలి తండ్రి పాత్రలో నటించాడు. ఆమెకు యవ్వన దశలో కలిగే సమస్యలను కళ్లకు కట్టినట్టు చిత్రీకరించారు. మమ్ముట్టితో పాటు సాధన అనే అమ్మాయి పోటీపడి నటించింది. ఇందులో తెలుగమ్మాయి అంజలీ కూడా ఒక పాత్ర పోషించింది. ఈ చిత్రం మమ్ముట్టి సినీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఈ చిత్రం వివిధ దేశాల ఫిల్మ్ ఫెస్టివల్‌లలో ప్రదర్శించబడి, మన్నలను అందుకుంది. ఈ ఏడాది ఈ చిత్రానికి మరిన్ని జాతీయ అవార్డులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటే ఈ చిత్రం ఎంతలా ప్రేక్షకులు ఇష్టపడుతున్నారో మనకు ఇట్టే అర్థమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైరా: పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్న దేవసేన