Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను కూడా మానవ మాత్రుడినే.. కూల్ కెప్టెన్ ఎలా అయ్యానంటే? (video)

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (17:02 IST)
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూల్ కెప్టెన్ అని పేరు తెచ్చుకున్నాడు. తన కూల్ నెస్‌కు కారణం ఏంటనే విషయాన్ని ధోనీ వివరించాడు. తాను కూడా మానవ మాత్రుడ్నే అని, అయితే మైదానంలో ఉన్నప్పుడు తన భావోద్వేగాలను అణచుకుంటానని చెప్పాడు.
 
మైదానంలోకి దిగిన తర్వాత ఎవరూ తప్పులు చేయాలని కోరుకోరని, మిస్ ఫీల్డింగ్ కానివ్వండి, క్యాచ్ వదిలేయడం కానివ్వండి... ఎవరూ కావాలని చేయరని ధోనీ పేర్కొన్నాడు. 
 
మైదానంలో ఎవరైనా ఫీల్డింగ్‌లో బంతిని వదిలేసినా, క్యాచ్ డ్రాప్ చేసినా, అలా ఎందుకు చేశారని వారి కోణంలోంచి ఆలోచిస్తానని ధోనీ తెలిపాడు. మైదానంలో 40వేల మంది, ప్రపంచ వ్యాప్తంగా ఇంకెంతో మంది మ్యాచ్‌ను తిలకిస్తుంటారని తెలిపాడు. 
 
ఓ ఆటగాడు 100 శాతం అంకితభావంతో ఆడుతూ ఓ క్యాచ్ వదిలేస్తే, అదేమంత సమస్యగా తాను భావించనని ధోనీ స్పష్టం చేశాడు. ప్రాక్టీసులో అతడెన్ని క్యాచ్‌లు పట్టాడన్నది ఆలోచిస్తానని, క్యాచింగ్‌లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని అధిగమించడానికి అతడు ప్రయత్నం చేశాడా లేదా అనేది గమనిస్తానని వివరించాడు. వదిలిన క్యాచ్ గురించి కాకుండా, తాను ఇలాంటి విషయాలను ఆలోచిస్తానని తెలిపాడు.
 
దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో పొరపాట్లు బాధ కలిగిస్తాయని, కానీ ఆ సమయంలో మన భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments