Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రెండో టీ20 : గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (14:58 IST)
పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో భారత్ మూడు టీ20 మ్యాచ్‌లను ఆడుతుంది. ఇందులోభాగంగా, మొహాలీలో జరిగిన తొలి టీ20లో భారత్ ఓడిపోయింది. శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెవాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. 
 
అలాగే, నేటి మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కంగారులు ఉన్నారు. దీంతో ఇరు జట్లూ హోరాహారీగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లు దృష్టిసారించారు. 
 
ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ పెద్దగా రాణించలేక పోయాడు. దీంతో అతని స్థానంలో రిషభ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. 
 
అలాగే, బౌలింగ్ విభాగంలో రాణించని భువనేశ్వర్ కుమార్‌ను తొలగించి ఫిట్నెస్ సాధించిన జస్స్రీత్ బుమ్రాకు చోటుకల్పించే అవకాశం లోకపోలేదు. భారత జట్టులో ఈ రెండు మార్పులు మినహా మిగిలిన జట్టును యధావిధిగా దింపే అవకాశం ఉంది. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. 
 
ఇరు జట్ల అంచనా.. 
 
భారత్ : రోహిత్, కేఎల్ రాహుల్, అశ్విన్, బుమ్రా, చాహల్, చాహర్, హూడా, దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్.
 
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్, అబ్బాట్, అగర్, డేవిడ్, ఎల్లిస్, గ్రీన్, హేజల్ వుడ్ జోష్ ఇంగ్లిష్, మ్యాక్స్‌వెల్, రిచర్డ్‌న్, డేనియల్ శ్యామ్స్, స్మిత్, వాడే, జంపా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments