Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరు పారేసుకున్న అక్తర్ : ముందు కాశ్మీర్.. ఆ తర్వాత భారత్‌ను ఆక్రమిస్తాం...

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (17:14 IST)
రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు పొందిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు నోటిదూల ఎక్కువైంది. ఆయన భారత్‌ను ఉద్దేసించి చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. తొలుత కాశ్మీర్‌ను ఆక్రమిస్తామని, ఆ తర్వాత భారత్‌ను ఆక్రమిస్తామని వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు ఇపుడు చేసినవి కావు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
గతంలో స‌మా టీవీతో అక్తర్‌తో ఓ ఇంటర్వ్యూ జరిపింది. అపుడు ఆయన మాట్లాడుతూ గజ్వా ఈ హింద్ గురించి ప్ర‌స్తావించారు. భార‌త్ కోసం నిర్వ‌హించే యుద్ధ‌మే గ‌జ్వా ఈ హింద్‌. ఉర్దూ మ‌త‌బోధ‌కుల ప్రకారం.. ముస్లిం యోధులు భార‌త భూభాగాన్ని హ‌స్తం గ‌తం చేసుకోవ‌డమే గ‌జ్వా ఈ హింద్‌. కానీ అనేక మంది ముస్లిం బోధ‌కులు ఆ సిద్ధాంతాన్ని వ్య‌తిరేకిస్తారు.
 
గ‌జ్వా ఈ హింద్ స‌మ‌రం జ‌రుగుతుంద‌ని త‌మ పురాణాల్లో ఉంద‌ని, అట్టాక్ ప‌ట్ట‌ణ స‌మీపంలోని న‌ది రెండు సార్లు ర‌క్తంతో ఎర్ర‌గా మారుతుంద‌న్నారు. ఆఫ్ఘ‌ాన్ ద‌ళాలు అట్టాక్ చేరుకుంటాయ‌ని, ఉజ్బెకిస్తాన్ నుంచి కూడా ద‌ళాలు వ‌స్తాయ‌ని అక్త‌ర్ తెలిపారు. త‌మ‌కు చెందిన ప‌విత్ర పుస్త‌కాల్లో గ‌జ్వా ఈ హింద్ గురించి ప్ర‌స్తావించార‌ని, దాని ప్ర‌కారం తొలుత కాశ్మీర్‌ను, ఆ త‌ర్వాత అన్ని వైపుల నుంచి భార‌త్‌ను ఆక్ర‌మిస్తామ‌ని షోయెబ్ అన్నారు. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments