వెస్టిండీస్‌తో ట్వంటీ-20 సిరీస్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు బస్సులో వెళ్తున్నప్పుడు ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చాహల్ కాసేపు రిపోర్టర్ అవతారం ఎత్తాడు. సహజర ఆటగాళ్లను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఫిజియో తలను నిమురుతూ ముద్దిచ్చాడు.
అంతేగాకుండా విండీస్ పోటీల్లో ఆడిన అనుభవాన్ని వెల్లడించాలని రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పాండేలతో పాటు కోచ్ సంజయ్ బంగర్‌లను ఇంటర్వ్యూ చేశాడు. ఆపై ఫిజియో తలపై ముద్దు పెట్టిన తరువాత, ఆటగాళ్లంతా పెద్దగా నవ్వేశారు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో కాస్త వైరలై కూర్చుంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
An inside scoop on #TeamIndia's T20I series win as we get behind the scenes and take our cameras inside the team bus. Hello and welcome to Chahal TV - by @Moulinparikh