Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ యార్కర్.. చెదిరిపోయిన స్టంప్.. కారణం ఎవరు? (Video)

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (17:52 IST)
శ్రీలంకతో జరిగిన చివరి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత జట్టు గెలుపును నమోదు చేసుకుని ట్రోఫీని గెలుచుకుంది. భారత్-శ్రీలంక మధ్య పూణేలో శుక్రవారం ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (54), శిఖర్ ధావన్ (52) అర్థసెంచరీలతో శుభారంభాన్నిచ్చారు. తదనంతరం మనీష్ పాండే (31), విరాట్ కోహ్లీ (26)లు మోస్తరుగా రాణించారు. ఇంకా ఫాస్ట్ బౌలర్ సర్దుల్ ఠాగూర్ 8 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక బౌండరీతో కలిసి 22 పరుగులు సాధించాడు. ఫలితంగా 20 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. 
 
ఆపై 202 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభం నుంచే తడబడింది. టీమిండియా బౌలర్ల ధాటికి లంకేయులు బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. శ్రీలంక జట్టులో మాథ్యూస్ మాత్రమే అత్యధికంగా 31 పరుగులు సాధించాడు. ధనంజయ సిల్వ 57 అర్థసెంచరీ సాధించాడు.

మిగిలిన బ్యాట్స్‌మెన్లు స్వల్ప పరుగులకే అవుటై పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలో 15.5 ఓవర్లలో శ్రీలంక జట్టు 123 పరుగులు మాత్రమే సాధించి ఆలౌటైంది. దీంతో 78 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుని టీ-20 సిరీస్‌ను 2-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌కు బంతి విసిరిన యువ బౌలర్ నవదీప్ సైనీ.. యాకర్ బౌలింగ్‌తో శ్రీలంక వికెట్ కీపర్ పెరెరా వికెట్‌ను తీసుకున్నాడు. సైనీ విసిరిన బంతికి స్టంప్ చెదిరిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యార్కర్‌తో అదరగొట్టి అద్భుతమైన వికెట్ చేజిక్కించుకున్న సైనీకి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments