Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్ల పిల్లల్ని నేను చదివిస్తానంటున్న మాజీ క్రికెటర్.. ఎవరు?

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (10:39 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు అండగా ఉండేందుకు భరతజాతి మొత్తం మద్దతుగా నిలుస్తోంది. ముఖ్యంగా, అదేసమయంలో జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు అనేక మంది సెలెబ్రిటీలు మందుకు వస్తున్నారు. ఇలాంటి వారిలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ఢిల్లీకి చెందిన ఈ మాజీ క్రికెటర్ తనది పెద్ద మనసు అంటూ మరోమారు నిరూపించాడు. 
 
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల పిల్లల పట్ల భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన సహృదయతను చాటుకున్నాడు. కన్నవాళ్లను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న సైనికుల కుటుంబాలకు బాసటగా నిలిచాడు. వీరసైనికుల పిల్లల చదవుకయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానంటూ సెహ్వాగ్ శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 
 
'దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం. ఉగ్రదాడిలో మరిణించిన సీఆర్పీఎఫ్ వీర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను నేను తీసుకుంటున్నాను. వారంతా నా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకోవచ్చు' అని వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించాడు. సెహ్వాగ్ ధాతృత్వంపై నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments