Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో టెస్టులో ఓడిపోతే కోహ్లీ తప్పుకుంటాడేమో : మాంటీ పనేసర్

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (17:35 IST)
ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను కంగారు పెట్టించిన భారత క్రికెట్ జట్టు ఇపుడు స్వదేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల చేతిలో చావుదెబ్బలు తింటోంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. త్వరలోనే ఇదే వేదికపై రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. తొలి టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. కోహ్లీ సారథ్యంలో టీమిండియా చివరిసారి టెస్టుల్లో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ స్పందిస్తూ, టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయినా, అతడి సారథ్యంలో భారత్‌ సరిగ్గా ఆడలేకపోతోందని వ్యాఖ్యానించారు. కోహ్లీ సారథ్యంలో గత నాలుగు టెస్టుల్లో భారత్‌ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అదేసమయంలో రహానే ఆస్ట్రేలియా పర్యటనలో జట్టును విజయపథంలో నడిపించాడు. 

'ఆల్‌టైమ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్‌ కోహ్లీ ఒకడు. కానీ, అతడి నేతృత్వంలో భారత్‌ సరిగ్గా ఆడటం లేదనిపిస్తోంది. అతడి కెప్టెన్సీలో గత నాలుగు టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా ఓడిపోవడం చూశాం. అదేసమయంలో కెప్టెన్‌గా అజింక్య రహానె అద్భుత ప్రదర్శన చేశాడు. కాబట్టి టీమ్‌ఇండియా సారథి ఇప్పుడు మరింత ఒత్తిడికి గురవుతుంటాడు. తర్వాతి మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓటమిపాలైతే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడేమో' అని పనేసర్ వ్యాఖ్యానించాడు. ’ అని పనేసర్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

తర్వాతి కథనం
Show comments