ఇండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీ కొట్టాడు. ఇది అతనికి వందో టెస్ట్ కావడం విశేషం. 164 బంతుల్లోనే 12 ఫోర్లతో రూట్ మూడంకెల స్కోరు అందుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 20వ సెంచరీ.
63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను సిబ్లీతో కలిసి రూట్ ఆదుకున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 160కిపైగా పరుగులు జోడించారు. అటు సిబ్లీ కూడా సెంచరీ వైపు అడుగులు వేస్తున్నాడు.
కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ స్కోరు 200 పరుగులు దాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. అయితే, 63 పరుగుల వద్ద ఓపెనర్లు రోరీ బర్న్స్ (33), డేనియల్ లారెన్స్ (0) అవుటవడంతో జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్.. ఓపెనర్ డొమినిక్ సిబ్లీతో కలిసి ఇన్సింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 74 ఓవర్లు ముగిశాయి. ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. డొమినిక్ 67, రూట్ 94 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు.