Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్టెడ్ ఫ్లైట్‌లో విరాట్ కోహ్లీ జర్నీ.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (13:27 IST)
kohli
సమయం దొరికినప్పుడల్లా మాకు వాయుకాలుష్యం గురించి లెక్చర్లు దంచే మీరు మాత్రం ఎటువంటి జాగ్రత్తలూ తీసుకోరా? అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కోహ్లీ తప్పులు చేస్తూ.. నీతులు చెప్పడం సరైన పద్ధతి కాదంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే వెస్టిండీస్ వన్డే టూర్ ముగించుకుని చార్టెడ్ ఫ్లైట్‌లో విరాట్ ఇండియాకు తిరిగి రావడం ఈ వివాదానికి దారితీసింది. వన్డే సిరీస్‌లో టీమిండియా విండీస్‌పై ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. ఇందులో కోహ్లీ కూడా అజేయ సెంచరీతో అదరగటొట్టాడు. ప్రస్తుతం టీ-20 సిరీస్‌ జరుగుతున్నా.. సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విరామం ఇచ్చింది. దీంతో విరాట్ కోహ్లీ స్వదేశానికి బయల్దేరాడు. 
 
విరాట్‌ కోసం గ్లోబల్ ఎయిర్ చార్టర్ సర్వీస్ ప్రత్యేకంగా ఓ చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. ఈ విషయాలను కింగ్ కోహ్లీ నెట్టింట పంచుకున్నాడు. అయితే చార్టర్ విమానంలో కోహ్లీ ప్రయాణించడం సరికాదని.. నిత్యం వాయుకాలుష్యం గురించి మాట్లాడే విరాట్, అనుష్కకు ప్రత్యేక విమానాలు పర్యావరణానికి ఎంతటి హానికరమో తెలీదా? అంటూ ఫైర్ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

యూపీఎస్సీ తుది జాబితా- తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది అభ్యర్థులకు స్థానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments