Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లి సంచలన నిర్ణయం: టీ-20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (18:35 IST)
Kohli
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. 
 
ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు కోహ్లి ట్విటర్‌ వేదికగా ఓ లేఖను విడుదల చేశాడు.
 
ఇంకా అక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో కోహ్లీ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. నాకు అత్యంత సన్నిహితులు, రవి భాయ్, రోహిత్ శర్మతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చా. 
 
దీని గురించి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాతో పాటు సెలక్టర్లతో కూడా మాట్లాడా. ఇండియన్ క్రికెట్, టీమ్‌కు తన శాయశక్తులా కృషి చేస్తున్నానని కోహ్లీ తెలిపాడు. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉండటంలో తనకు సపోర్ట్ చేసిన అందరికీ కోహ్లీ ధన్యవాదాలు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments