Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్న క్రికెటర్...

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్నాడు. అది ఎలాంటి ఫార్మెట్ అయినా సరే శతకాలు కొట్టడమే తనకంటే మొనగాడు ఎవ్వరూ లేరని చేతల్లో నిరూపిస్తున్నాడు. ఫలితంగా టెస్టుల

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (10:08 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్నాడు. అది ఎలాంటి ఫార్మెట్ అయినా సరే శతకాలు కొట్టడమే తనకంటే మొనగాడు ఎవ్వరూ లేరని చేతల్లో నిరూపిస్తున్నాడు. ఫలితంగా టెస్టులు, వన్డేల్లో కలిపి అత్యధిక శతకాలు చేసిన వీరుల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. 
 
ఇప్పటివరకు వన్డేల్లో 34వ సెంచరీ చేసిన విరాట్‌.. (టెస్టుల్లో 21) మొత్తంగా తన శతకాల సంఖ్యను 55కు పెంచుకున్నాడు. తద్వారా చెరో 54 శతకాలతో ఉన్న సౌతాఫ్రికా క్రికెటర్ ఆషీమ్ ఆమ్లా, శ్రీలంక మాజీ క్రికెటర్ జయవర్దనెలను కోహ్లీ వెనక్కునెట్టాడు. 
 
కాగా, ఈ జాబితాలో వంద సెంచరీలతో సచిన్‌ (51+49) మొదటిస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ (71), లంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర (63), దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్‌ కలిస్‌ (62) తర్వాతి స్థానంలో ఉన్నారు. 
 
అలాగే, భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు కొట్టిన రికార్డును కూడా కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ 11 సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ 12 సెంచరీలు చేసి ఆ రికార్డును అధికమించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాయనాడ్‌లో 48,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

తర్వాతి కథనం
Show comments