Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విరాట్ కోహ్లీ దీర్ఘకాలిక కెప్టెన్‌గా కొనసాగుతాడా?

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ గొప్ప ఆటగాడనే విషయాన్ని అంగీకరిస్తాను. అయితే కోహ్లీ గొప్ప నాయకుడేనా?అంటూ అతని ప్రతిభపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మి

Advertiesment
విరాట్ కోహ్లీ దీర్ఘకాలిక కెప్టెన్‌గా కొనసాగుతాడా?
, బుధవారం, 24 జనవరి 2018 (09:15 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ గొప్ప ఆటగాడనే విషయాన్ని అంగీకరిస్తాను. అయితే కోహ్లీ గొప్ప నాయకుడేనా?అంటూ అతని ప్రతిభపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అనుమానం వ్యక్తం చేశాడు. జట్టును పదేపదే మార్చడం కోహ్లీకి ప్రతికూలంగా మారుతోందని స్మిత్ పేర్కొన్నాడు.

డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లీని ప్రశ్నించే వారే లేరని.. ఇతని వ్యవహారం చూస్తుంటే టీమిండియాకు కోహ్లీ దీర్ఘకాలిక కెప్టెన్‌గా కొనసాగుతాడని అనిపించట్లేదన్నాడు. 
 
జట్టులో అతడి ఆలోచనలతో విభేదించేవారు కూడా ఉంటే జట్టుకు మేలు జరుగుతుందని స్మిత్ పేర్కొన్నాడు. మైదానంలో ఏ క్రికెట్ ఎలా ఆడాలో, ఎలా వుండాలో కోహ్లీ కొన్ని పరిమితులు విధించాడని.. మైదానంలో అతని తీరు, భావోద్వేగాలు సహచరులపై ప్రతికూల ప్రభావం చూపే విధంగా ఉన్నాయని ఆరోపించాడు. ఇలాగే దూకుడుగా, కోపంగా ఉంటే అతనిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
ఈ ఏడాది ముగిసే వరకు అతడు విదేశాల్లోనే పర్యటించాల్సి ఉందని.. దీంతో ఒత్తిడి తప్పదని.. మీడియా నుంచి ఇష్టంలేని ప్రశ్నలు ఎదుర్కొనాల్సి వస్తుందని స్మిత్ గుర్తు చేశాడు. సొంత దేశంలో అతడికి మద్దతు దొరకొచ్చేమో గానీ విదేశాల్లో మాత్రం అలా కుదరదని కుండబద్దలు కొట్టాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీకి అంత సీన్ లేదు: గ్రేమ్ స్మిత్