Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ పుష్ప తగ్గేదేలే స్టైల్‌లో కోహ్లీ.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (11:15 IST)
Kohli
మొహాలీ టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు అయినప్పటికీ... కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే బ్యాటింగ్ చేయగా విరాట్ కోహ్లీ 45 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. పెద్దగా ఈ మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఈ మ్యాచ్‌లో ర‌వీంద్ర జ‌డేజా మాత్రం ఆల్‌రౌండ్ షోతో ఆక‌ట్టుకుని ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
 
అయితే పుష్ప అల్లు అర్జున్ స్టైల్‌ను టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుకరించి వార్తల్లో నిలిచాడు. పుష్ప క్రేజ్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తగ్గలేదు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. 
 
ఇటీవల క్రికెటర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో తగ్గేదే లే అంటూ బన్నీ మేనరిజాన్ని ఇమిటేట్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తగ్గేదే లే అంటూ మేన‌రిజంతో ఆక‌ట్టుకున్నాడు. 
 
కోహ్లీ చేసిన ఈ ప‌నిని గ్రౌండ్‌లోని కెమెరాలు రికార్డు చేశాయి. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ప్రస్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేసిన ఉపాధ్యాయుడు!!

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

తర్వాతి కథనం
Show comments