Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలమన్నదే నా నినాదం: కోహ్లీ

కలలు కనండి, కలలను ప్రేమించండి, కలల్లో జీవించండి, కలలను సాఫల్యం చేసుకోండి అంటూ భారత అథ్లెట్లకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విలువైన సూచన చేశాడు. శుక్రవారం జరిగిన ఆలిండియా సెంట్రల్‌ రెవెన్యూ స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (05:21 IST)
కలలు కనండి, కలలను ప్రేమించండి, కలల్లో జీవించండి, కలలను సాఫల్యం చేసుకోండి అంటూ భారత అథ్లెట్లకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విలువైన సూచన చేశాడు. శుక్రవారం జరిగిన ఆలిండియా సెంట్రల్‌ రెవెన్యూ స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ తమ కలలపై దృఢ నమ్మకంతో ఉండాలని, వాటిని సాకారం చేసుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాలని సూచించాడు. ‘ఒకవేళ నా మాటలు పనికొస్తాయనుకుంటే.. అథ్లెట్లందరికీ, ఇక్కడున్న వారికి నేను చెప్పేదొకటే. మీమీద మీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలరు. నేను ఇదే నినాదంతో జీవిస్తున్నా. అలాంటి భావనతోనే ప్రతీ రోజూ నడుస్తున్నా. ఏదైనా సాధించాలన్న ఆలోచన ఉంటే.. దాన్ని అందుకోగలమని మిమ్మల్ని మీరు ఒప్పించుకోండి’ అని చెప్పాడు.
 
ఈ కార్యక్రమానికి హాజరైన భారత మహిళా రెజ్లర్లు బబిత ఫొగట్‌, గీతా ఫొగట్‌లను విరాట్‌ కొనియాడాడు. ‘ఇటీవలే ఈ అక్కాచెల్లెళ్ల సినిమా (దంగల్‌) చూశా. గుండెలను తాకింది. మొత్తం ఆరుగురు సోదరీమణులున్నా మీరిద్దరే (బబిత, గీత) సినిమాను నడిపించారు. దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సాధించిపెట్టార’ని ప్రశంసించాడు. ‘జీవితంలో, ఆటలో దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలపండి. మీరు సాధించే విజయాలతో అందరూ గర్వపడేలా చేయండి. అందుకోసం నేను కూడా శక్తి మేరకు కృషి చేస్తాన’ని విరాట్‌ పిలుపునిచ్చాడు.
 

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments