విరుష్క ఇంట్లో పనిమనుషులు వుండరట.. అన్నీ తానై కోహ్లీ చేస్తాడట..!

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:21 IST)
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అతనిదని, చాలా నిరాడంబరంగా ఉంటాడని అతడు చెప్పాడు. కోహ్లి, అతని భార్య అనుష్క శర్మల సంపద రూ.1200 కోట్ల వరకూ ఉంటుంది. 
 
ఈ ఇద్దరూ ముంబైలో రూ.34 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అయినా వాళ్ల ఇంట్లో పని మనిషి లేదని, ఇంటికి గెస్ట్‌లు ఎవరు వచ్చినా కోహ్లి, అనుష్కనే స్వయంగా వాళ్లకు అన్ని పనులు చేసి పెడతారని శరణ్‌దీప్ సింగ్ చెప్పాడు.
 
ఫీల్డ్‌లో కోహ్లి చాలా దూకుడుగా ఉంటాడు. అతన్ని చూసిన చాలా మంది కోహ్లి ఎవరి మాటా వినడు అని అనుకుంటారు. కానీ అతడు చాలా సింపుల్‌గా ఉంటాడు. టీమ్ సెలక్షన్‌లోనూ అందరు చెప్పింది శ్రద్ధగా విని నిర్ణయం తీసుకుంటాడు అని శరణ్‌దీప్ తెలిపాడు.
 
టీమ్‌లోని అందరు ప్లేయర్స్‌కూ అతనంటే చాలా గౌరవమని అన్నాడు. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో పనివాళ్లు కచ్చితంగా ఉంటారు. అలాంటిది కోహ్లి ఇంట్లో ఎవరూ లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసినట్లు శరణ్‌దీప్ చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అందుకే పుతిన్ భారత్ వెళ్తాడు, పాకిస్తాన్‌కు రాడు: పాక్ జర్నలిస్ట్, షాక్‌లో పాక్ జనం

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

తర్వాతి కథనం
Show comments