Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vinod Kambli ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ... వైద్యుల షాకింగ్ నివేదిక

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (12:12 IST)
Vinod Kambli
Vinod Kambli భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు శనివారం నాడు థానేలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ కాంబ్లీకి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సోమవారం షాకింగ్ నివేదిక ఇచ్చారు. అతని మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
కాంబ్లీకి చికిత్స చేస్తున్న డాక్టర్ వివేక్ త్రివేది మాట్లాడుతూ.. భారత మాజీ క్రికెటర్ ఆరంభంలో మూత్రనాళ ఇన్ఫెక్షన్, తిమ్మిరితో బాధపడుతూ శనివారం భివాండి పట్టణంలోని కల్హేర్ ప్రాంతంలోని ఆసుపత్రిలో చేరాడు. అయితే, ఆసుపత్రిలో అతనిని పర్యవేక్షిస్తున్న వైద్య బృందం వరుస పరీక్షల తర్వాత కాంబ్లీ మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించిందని త్రివేది తెలియజేశారు.
 
కాంబ్లీ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వైద్య బృందం మంగళవారం అదనపు వైద్య పరీక్షలు నిర్వహిస్తుందని డాక్టర్ తెలిపారు. కాంబ్లీకి జీవితాంతం ఉచిత చికిత్స అందించాలని ఆసుపత్రి ఇన్‌చార్జ్ ఎస్.సింగ్ నిర్ణయించుకున్నట్లు త్రివేది తెలిపారు.
 
1996 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన కాంబ్లీ తన రిటైర్మెంట్ తర్వాత కెరీర్లో ఆరోగ్యపరమైన ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయాడు. అతను ఇటీవల తన చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో కనిపించిన విషయం తెలిసిందే. 
 
ఆ సమయంలో కూడా అతను బలహీనంగానే కనిపించాడు. ఈ కార్యక్రమంలో తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్‌ను కలిసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు. ఇక ఇటీవల అతని ఆరోగ్య పరిస్థితి గమనించిన భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు వినోద్ కాంబ్లీకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments