బీసీసీఐకు కాసుల వర్షం. ప్రసార హక్కుల కోసం రూ.6 వేల కోట్లు

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:46 IST)
క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన బోర్డుగా ఉన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు కాసుల వర్షం కురుస్తుంది. 2023-28 సీజన్లకు గాను మీడియా హక్కులను వయాకామ్-19 చేజిక్కించుకుంది. ఇందుకోసం బీసీసీఐకు దాదాపుగా రూ.6 వేల కోట్ల ఆదాయం రానుంది. ఈ ప్రసార హక్కుల కింద భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే అన్ని మ్యాచ్‌లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు ఈ-వేలం నిర్వహించగా, వీటికి సోనీ పిక్చర్స్, డిస్నీస్టార్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ వయాకామ్-19 దక్కించుకుంది. వయాకామ్ 18 సంస్థ రిలయన్స్‌కు చెందిన కంపెనీ కావడం గమనార్హం. 
 
ఈ పోటీలో విజేతగా నిలిచేందుకు వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి కళ్లు చెదిరే రీతిలో రూ.5,963 కోట్లు చెల్లించనుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లను వయాకామ్ తన స్పోర్ట్స్-18 చానల్లో ఐదేళ్ల పాటు ప్రసారం చేయనుంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు అన్ని సీజన్లలో మ్యాచ్‌లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మీడియా హక్కుల కోసం నిర్వహించిన ఈ-వేలంలో వయాకామ్ 18 సంస్థకు డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments