Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేష్ రైనా, యువీని కోహ్లీ ఇంట్లో కూర్చోబెట్టాడు: కేఆర్కే కామెంట్స్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బాలీవుడ్ నటుడు, నిర్మాత, సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) మండిపడ్డాడు. టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్లైన యువరాజ్ సింగ్, సురేష్ రైనా కెరీర్‌ను విరాట్ కోహ్ల

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (13:14 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బాలీవుడ్ నటుడు, నిర్మాత, సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) మండిపడ్డాడు. టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్లైన యువరాజ్ సింగ్, సురేష్ రైనా కెరీర్‌ను విరాట్ కోహ్లీ నాశనం చేశాడంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్, రైనాలను ఉద్దేశించి కేఆర్కే ట్వీట్ చేశారు. కోహ్లీ యువీని, రైనాను ఇంట్లో కూర్చోబెట్టాడని.. తన కామెంట్స్‌పై కామెంట్రీ చెప్పుకోండంటూ ట్వీట్ చేశారు. 
 
కివీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో యువరాజ్ సింగ్, సురేష్ రైనాలకు స్థానం కల్పించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కోహ్లీనే రైనా, యువీలకు జట్టులో స్థానం లభించకపోవడానికి కారణమంటూ మండిపడ్డాడు. ఇక.. సురేష్ రైనా తన ట్వంటీ-20 మ్యాచ్‌ను ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై ఆడగా, విండీస్‌తో యువీ చివరి మ్యాచ్ ఆడాడు. ఆపై వీరిద్దరికీ జట్టు స్థానం దక్కలేదు. ఫిట్‌నెస్ లేమి కారణంగా వీరిద్దరిని బీసీసీఐ పక్కనబెట్టిందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments