Tilak Varma: తిలక్ వర్మ అరుదైన కండరాల వ్యాధి.. ఎలా క్రికెట్ ఆడాడంటే?

సెల్వి
శుక్రవారం, 24 అక్టోబరు 2025 (14:03 IST)
Tilak varma
భారత క్రికెటర్ తిలక్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కష్టతరమైన ఆరోగ్య పోరాటం గురించి మాట్లాడారు. తనకు రాబ్డోమియోలిసిస్ అనే అరుదైన, తీవ్రమైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన వెల్లడించారు. తిలక్ వర్మ ఆ బాధాకరమైన రోజుల్లో శరీరాన్ని పరిమితికి మించి కష్టపెట్టి క్రికెట్ ఆడానని తిలక్ వర్మ గుర్తు చేసుకున్నాడు.  
 
వ్యాధి గురించి తెలియకుండానే తన పరిస్థితిని మరింత దిగజార్చానని.. ముందస్తు హెచ్చరిక సంకేతాలను విస్మరించానని, ప్రాణాంతక పరిణామాలను కలిగించే నొప్పి ద్వారా అలాగే ఆడుతూ ఉన్నానని చెప్పాడు. ఆకాష్ అంబానీ, బీసీసీఐ నుండి మద్దతు తిలక్ ఆకాష్ అంబానీ పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. 
 
ఆసియా కప్ ఫైనల్ తర్వాత తిలక్ వర్మను అభిమానులు ఆకాశానికి ఎత్తారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు రెడీ అవుతున్నాడు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు తిలక్ వర్మ బాంబు పేల్చాడు. ఓ ఇంటర్వ్యూలో తిలక్ వర్మ తనకొచ్చిన అరుదైన వ్యాధి గురించి తొలిసారి పెదవి విప్పాడు. 
 
2022 ఐపీఎల్ సీజన్ తర్వాత తిలక్ వర్మ ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడ్డాడు. టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడాలనే తపనతో తీవ్రంగా కష్టపడ్డట్లు పేర్కొన్నాడు. ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో ఎక్కువ సేపు గడిపినట్లు కూడా పేర్కొన్నాడు. తాను జిమ్‌లో వర్కౌట్స్ చేసిన తర్వాత బాడీ రికవరీ అయ్యేందుకు టైమ్ ఇచ్చేవాడిని కాదని దాంతో రాబ్డోమియోలిసిస్ వ్యాధి బారిన పడ్డట్లుగా తిలక్ పేర్కొన్నాడు.
 
బంగ్లాదేశ్‌ ‘ఎ’తో జరిగిన ఒక సిరీస్ సందర్భంగా ఒక మ్యాచ్‌తో తాను సెంచరీకి చేరువైనట్లు తెలిపాడు. అప్పుడు ఉన్నట్లుండి కళ్లు మూతలు పడ్డట్లు.. చేతి వేళ్లను కదిలించలేకపోయినట్లు తెలిపాడు. నా శరీరం రాయిలా మారిపోయినట్లు పేర్కొన్నాడు. దాంతో తాను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినట్లు తెలిపాడు. ఆ తర్వాత చేతికి ఉన్న గ్లౌవ్స్‌ను కట్ చేసినట్లు తెలిపాడు. జై షా వెంటనే తన పరిస్థితిని తెలుసుకొని హాస్పిటల్‌లో చేర్చించినట్లు.. ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ కాల్ చేసి తన పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు పేర్కొన్నాడు. 
 
హాస్పిటల్‌లో చేరిన తర్వాత డాక్టర్లు తనకు సెలైన్ పెట్టేందుకు ట్రై చేసినట్లు.. అయితే నరాలు రాళ్లలా మారిపోవడంతో సిరంజీలు విరిగిపోయినట్లు కూడా తెలిపాడు. అయితే డాక్టర్లు పుణ్యమా తాను ఆ గండం నుంచి బయటపడినట్లుగా పేర్కొన్నాడు. ఈ అరుదైన వ్యాధి నుంచి బయటపడ్డ తిలక్ వర్మ ఇప్పుడు టీమిండియాలో కీలక ప్లేయర్‌గా మారాడు. త్వరలోనే ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా మారే అవకాశం కూడా ఉంది. టి20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు పయనం అయ్యాడు.
 
కాగా రాబ్డోమియోలిసిస్ అనేది కండరాల నొప్పి, బలహీనత, టీ-రంగులో మూత్రం వంటివి దీని ప్రధాన లక్షణాలు. తీవ్రమైన వ్యాయామం, గాయాలు, కొన్ని మందులు, అనారోగ్యాల వల్ల ఇది సంభవించవచ్చు. తక్షణ చికిత్స ముఖ్యం, ఎందుకంటే ఇది తీవ్రమైన కిడ్నీ వైఫల్యానికి దారితీయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

Drum: భార్యను చంపి మృతదేహాన్ని డ్రమ్‌లో నింపి పూడ్చిపెట్టేశాడు..

స్థానిక సంస్థల్లో పోటీ- ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ

విద్యార్థులకు శుభవార్త చెప్పిన టి విద్యాశాఖ.. ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

Sri Vishnu: ఒంగోలు నేపథ్యంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా చిత్రం

తర్వాతి కథనం
Show comments