Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. అవుటైతే పర్లేదు.. టీ-20ల్లో పరుగులే ముఖ్యం

కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ చేయకుండా.. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తర

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (10:12 IST)
కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ చేయకుండా.. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తరువాత ధోనీని అనిల్ కుంబ్లే వంటి ఆటగాళ్లు విమర్శించగా, గవాస్కర్ వంటి వారు వెనకేసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ ఆటతీరుపై వస్తున్న విమర్శల సందర్భంగా సెహ్వాగ్ స్పందించాడు. 
 
ధోనీకి విలువైన సలహా ఇచ్చాడు. వన్డేలతో పోలిస్తే, టీ-20ల్లో పరిస్థితి వేరుగా ఉంటుందన్నాడు. ఇది ధోనీకి తెలియని విషయమేమ కాదంటూనే.. మిడిలార్డర్‌లో వచ్చే ధోనీ.. నిలదొక్కుకునేందుకు ప్రయత్నించకుండా, తొలి బాల్ నుంచే పరుగులు చేసేందుకు ప్రయత్నించాలన్నాడు. ఈ ప్రయత్నంలో అవుటైపోయినా పర్లేదు కానీ, క్రీజులో పాతుకుపోయి పరుగులు చేయకుండా ఉండటం సరికాదన్నాడు. 
 
ఆడిన నాలుగు బంతులనూ బౌండరీలకు పంపితే, టీ-20ల్లో మేలు కలుగుతుందని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. సాధించాల్సిన పరుగులు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, ధోనీ వంటి ఆటగాడు, వేగాన్ని పెంచలేకపోతే ఆ ప్రభావం జట్టు మీద పడుతుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments