Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియన్ల కంగారు.. - 6 వికెట్లతో భారత్ ఘన విజయం

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (16:37 IST)
ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్లు మరోమారు కంగారుపడ్డారు. ఫలితంగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 115 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లను కోల్పోయి ఆరు వికెట్లు తేడాతో గెలుపొందింది. స్పిన్‌కు పూర్తిగా అనుకూలించే ఈ పిచ్‌పై భారత ఆటగాల్లు రోహిత్ శర్మ, పుజారా, భరత్, కోహ్లీలు కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లో గవాస్కర్ - బోర్డర్ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 61/1తో ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ మూడో రోజైన ఆదివారం పేకమేడలా కుప్పకూలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు ఆధిక్యాన్ని సాధించిన కంగారులు.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ ముంగిట 115 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను భారత బౌలర్లలో రవీంద్ జడేజా, అశ్విన్‌లు కుప్పకూల్చారు. వీరిద్దరు కలిసి మొత్తం పది వికెట్లు తీశారు. ఇందులో జడేజా ఏడు, అశ్విన్ మూడు వికెట్లు చొప్పున తీశారు. అలాగే, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అత్యధికంగా ట్రావిస్ హెడ్ (43), లబుషేన్ (35) మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేశారు. 
 
ఆ తర్వాత 115 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. రెండో ఓవరల్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి లైయన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ 31, విరాట్ కోహ్లీ 20, శ్రేయాస్ అయ్యర్ 12, పుజారా 31, కేఎస్ భరత్ 23 చొప్పున పరుగులు చేశఆరు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్ 2, టాడ్ మార్ఫీ ఒక వికెట్ తీశారు. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేయగా, భారత్ 262 పరుగులు చేసిన విషయం తెల్సిందే. 
 
అయితే, రెండో టెస్ట్ మ్యాచ్‌ను మూడు రోజులు పూర్తికాకముందే ముగించడం వెనుక భారత బౌలర్ల శ్రమ దాగివుంది. స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు పోటీపడి వికెట్లు తీశారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు వరుసగా క్యూకట్టారు. ఈ ఇన్నింగ్స్‌‍లో రవీంద్ర జడేజా ఏడు వికెట్లు తీయగా అశ్విన్ మూడు వికెట్లు తీసి కంగారుల వెన్నువిరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments