Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేలో భారత్ పర్యటన: రేప్ కేసులో టీమిండియా క్రికెటర్ అరెస్టా.. ఏంటిది?

మూడు వ‌న్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ప్ర‌స్తుతం టీమిండియా హరారేలో ప‌ర్య‌టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియాకు కష్టాలొచ్చాయి. ఓ అత్యాచార కేసులో భాగంగా టీమిండి

Webdunia
ఆదివారం, 19 జూన్ 2016 (16:36 IST)
మూడు వ‌న్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ప్ర‌స్తుతం టీమిండియా హరారేలో ప‌ర్య‌టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియాకు కష్టాలొచ్చాయి. ఓ అత్యాచార కేసులో భాగంగా టీమిండియా-జింబాబ్వే సిరీస్ స్పాన్సర్లలో ఒక బ్రాండుకు సంబంధించిన అధికారిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. కానీ అత్యాచార కేసులో ఓ టీమిండియా క్రికెటర్‌ను అరెస్ట్ చేశారంటూ జింబాబ్వే మీడియా కోడైకూయడం సంచలనం సృష్టించింది. 
 
కానీ జింబాబ్వేలో భార‌త అంబాసిడ‌ర్ అయిన మాసాకుయ్ ఆ ఆట‌గాడిని అరెస్ట్ కానీయ‌కుండా అడ్డుకున్నట్లు జింబాబ్వే మీడియా ఆరోపించింది. కానీ జింబాబ్వే మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన వ్య‌క్తి స్పాన్స‌ర్ల‌లో ఒక‌టైన బ్రాండ్‌కు సంబంధించిన వ్య‌క్త‌ి మాత్రమేనని చెప్పారు.

ఈ వ్యవహారంతో భారత క్రికెటర్లకు ఎలాంటి సంబంధం లేదని, ఈ రేప్ కేసుకు సంబంధించి ఓ భార‌త సంత‌తి వ్య‌క్తిని అరెస్ట్ చేశార‌ని, ఆయ‌న కూడా త‌న‌కు ఏమీ తెలియ‌ద‌న్నాడు. ఇంకా డీఎన్ఏ టెస్ట్‌కు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ అంశంపై మాట్లాడటానికి బీసీసీఐ నిరాక‌రించింది. పూర్తి వాస్త‌వాలు తెలుసుకున్న త‌ర్వాత స్పందిస్తామ‌ని తేల్చి చెప్పింది.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments