Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వే పర్యటనలో భారత్‌కు తొలి షాక్.. టీ-20 మ్యాచ్‌లో ధోనీ గ్యాంగ్‌కు చుక్కెదురు!

జింబాబ్వే పర్యటనలో భారత్‌కు తొలి ట్వంటీ-20లో షాక్ తగిలింది. వన్డే సిరీస్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకున్న భారత జట్టుకు జింబాబ్వే ఆటగాళ్లు తొలి ట్వంటీ-20లో చుక్కలు చూపించారు. 171 పరుగుల లక్ష్యాన్ని చేధించే

Webdunia
ఆదివారం, 19 జూన్ 2016 (11:49 IST)
జింబాబ్వే పర్యటనలో భారత్‌కు తొలి ట్వంటీ-20లో షాక్ తగిలింది. వన్డే సిరీస్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకున్న భారత జట్టుకు జింబాబ్వే ఆటగాళ్లు తొలి ట్వంటీ-20లో చుక్కలు చూపించారు. 171 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ధోనీసేన తడబడటంతో జింబాబ్వే విజయకేతనం ఎగురవేసింది. నిర్ణీత 20 ఓవర్ల ధోనీసేన 168 పరుగులే సాధించి రెండు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విజయానికి చివరి ఓవర్‌లో ఎనిమిది పరుగులు అవసరమవగా, పేసర్ నెవిల్ మద్జివా ఐదు పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. 
 
ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ.. అనుభవం లేని మద్జీవా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కోలేకపోవడం ద్వారా మ్యాచ్‌కు ముగింపు ఇవ్వలేకపోయాడు. భారత జట్టులో మనీశ్‌పాండే(35 బంతుల్లో 48), మన్‌దీప్‌సింగ్(27 బంతుల్లో 31,) రాణించగా, ధోనీ(19 నాటౌట్), జాదవ్(19), రాయుడు(19), అక్షర్(18) పర్వాలేదనిపించారు. 
 
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఎల్టన్ చిగుంబరా(26 బంతుల్లో 54 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీకి కీపర్ వాలర్(30) మసకద్జా(25)ల స్కోరు జతకావడంతో 20 ఓవర్లలో జింబాబ్వే ఆరువికెట్లు కోల్పోయి 170 పరుగుల భారీస్కోరు చేసింది. చిగుంబరాకు మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ దక్కింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

తర్వాతి కథనం
Show comments