భారత్ - శ్రీలంక ఆతిథ్యంతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (21:36 IST)
వచ్చే యేడాది 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరుగనుంది. భారత్ - శ్రీలంక దేశాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు టోర్నీ జరుగనుంది. అయితే, భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య కొలంబో వేదికగా ఫిబ్రవరి 16వ తేదీన జరుగనుంది. 
 
కాగా, ఈ టోర్నీలో ఈ దఫా మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. ఇందులో పాల్గొనే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో రెండేసి జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లోని నాలుగు జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. 
 
ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లు భారత్‌లోని అయిదు వేదికల్లో (అహ్మదాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై), శ్రీలంకలోని మూడు వేదికల్లో (క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో) జరగనున్నాయి.
 
షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్, భారత జట్టు మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. భారత్‌కు 2024 ప్రపంచ కప్‌ సాధించిన పెట్టిన రోహిత్ శర్మను టీ20 వరల్డ్ కప్ 2026కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. 
 
భారత్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు...  
ఫిబ్రవరి 7 - యూఎస్‌ఏతో.. ముంబై 
ఫిబ్రవరి 12 - నమీబియాతో.. ఢిల్లీ 
ఫిబ్రవరి 15 - పాకిస్థాన్‌తో.. ప్రేమదాస స్టేడియం, కొలంబో 
ఫిబ్రవరి 18 - నెదర్లాండ్స్‌తో.. అహ్మదాబాద్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

పరకామణి చోరీ కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర : భూమన

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments