Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఏంటది?

ఠాగూర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (22:55 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో భాగంగా, భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతున్న సూర్య కుమార్.. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌లో ఏకంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 2,714 బంతుల్లో ఈ ఘనత సాధించి, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. 
 
సూర్య కుమార్ కంటే ముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ 2,820 బంతుల్లో 4 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. సూర్య కుమార్ తన వేగవంతమైన బ్యాటింగ్‌తో ఆ రికార్డును బద్ధలు కొట్టాడు. 
 
ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్‌గా చూస్తే, క్రిస్ గేల్, ఏబీ డీవిలియర్స్‌లు మాత్రే 2,568 బంతుల్లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు చేసాశారు. వీరి తర్వాత మూడో క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో తన ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్ కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న మరో మైలురాయిని కూడా సూర్యకుమార్ అధికమించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

తర్వాతి కథనం
Show comments