Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ కొత్త బాస్‌గా సౌరబ్ గంగూలీ? అనుకూలంగా మారిన సుప్రీంకోర్టు తీర్పు

క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త బాస్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆయనకు ఈ అవక

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (14:07 IST)
క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త బాస్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆయనకు ఈ అవకాశాన్ని మరింత సులభతరం చేసింది. 
 
ప్రస్తుతం బీసీసీఐ చీఫ్‌గా కొనసాగుతున్న అనురాగ్ ఠాకూర్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుకు తదుపరి అధ్యక్షుడు ఎవరే దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. లోథా కమిటీ సిఫారసుల ప్రకారం 70 ఏళ్లు పైబడిన వారు ఈ పదవిని చేపట్టడానికి అనర్హులు. దీంతో గంగూలీ పేరు తెరపైకి వచ్చింది. 
 
ప్రస్తుతం దేశంలో ఐదు క్రికెట్ జోన్లు ఉన్నాయి. మూడేళ్లకోసారి రొటేషన్ పద్ధతిలో బీసీసీఐ చీఫ్‌ను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారంగా ప్రస్తుతం ఈస్ట్ జోన్‌ టర్మ్ కావడంతో ఆ ప్రాంతానికి చెందిన అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ చీఫ్‌గా ఉంటూ తన పదవిని కోల్పోయారు. దీంతో ఇపుడు ఇదే జోన్‌కు చెందిన వ్యక్తినే ఎన్నుకోవాల్సి ఉంది. 
 
అనురాగ్ ముందు శశాంక్ మనోహర్ ఈస్ట్ జోన్ నుంచే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఈస్ట్ జోన్ నుంచి అధ్యక్ష పదవిని అధిరోహించగల వ్యక్తి ఎవరా? అని ఆరా తీస్తే డేరింగ్ అండ్ డ్యాషింగ్ సౌరవ్ గంగూలీనే కనిపిస్తున్నాడు.  అంతులేని క్రికెట్ అనుభవంతో పాటు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్న గంగూలీకీ బీసీసీఐ బాస్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments