ఐపీఎల్ 2025 : ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ... ఏ జట్టు గెలవాలని రాజమౌళి అనుకుంటున్నారు?

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (15:15 IST)
ఐపీఎల్ 2025 పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య అంతిమ పోరు జరుగనుంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఫైనల్ పోటీ ఫలితంపై సినీ దర్శకుడు రామజౌళి స్పందించారు. మంగళవారం ఫైనల్‌లో తలపడే రెండు జట్లూ మంచి జట్లేనని, వాళ్లిద్దరిలో ఎవరూ ఓడినా గుండెలు పిండేసినట్టే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సారి ఎవరికి దక్కినా, మరొకరు ఓడిపోవడం తీవ్రంగా బాధిస్తుందని ఆయన ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై రాజమౌళి స్పందిస్తూ, ఒక కెప్టెన్ (శ్రేయాస్ అయ్యర్) ఆటతీరు అద్భుతమన్నారు. బుమ్రా, బౌల్ట్ వంటి బౌలర్లు సంధించిన యార్కర్లను అతడు థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించడం చూస్తుంటే అద్భుతం అనిపిచింది. 
 
"ఆ ఆటగాడి నాయకత్వ పటిమ చూస్తుంటే... ఈ వ్యక్తి ఢిల్లీ జట్టును ఫైనల్ వరకు నడిపించాడు. కానీ ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. కోల్‌కతాకు ట్రోఫీ అందించాడు. మళ్లీ అదే పరిస్థితి. ఒక యువ జట్టు అయిన పంజాబ్‌ను ఏకంగా 11 యేళ్ల తర్వాత ఫైనల్స్‌కు చేర్చాడు. అతను కూడా ఈ యేడాది ట్రోఫీ గెలవడానికి అన్ని విధాలా అర్హుడు అని అయ్యర్‌పై రాజమౌళి తన అభిమానాన్ని చాటుకున్నాడు. శ్రేయాస్ ఒక ఆటగాడిగా, నాయకుడుగా ఎన్నో విజయాలు అందించినప్పటికీ కొన్నిసార్లు సరైన గుర్తింపు దక్కపోవడంపై పరోక్షంగా తన ఆవేదనను రాజమౌళి వ్యక్తం చేశారు.
 
మరోవైపు, విరాట్ కోహ్లీ ప్రస్తావన తెస్తూ, అతని నిలకడైన ప్రదర్శన ప్రశంసనీయమన్నారు. ప్రతి యేటా అద్భుతంగా రాణిస్తూ, వేల కొద్దీ పరుగులు సాధిస్తున్నాడు. అతనికి ఈ ట్రోఫీ ఒక చివరి లక్ష్యం వంటిది. అతను కూడా ఖచ్చితంగా ఈ ట్రోఫీకి అర్హుడే అని పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments