Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీని నేను వ్యతిరేకించానా? వెంగీ చీఫ్ సెలక్టర్ పదవి ఊడిందా?: శ్రీనివాసన్

టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై ఆతని భార్య హసీన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంతో షమీ కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేసింది. ఇంకా పోలీసులు కూడా షమీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. షమీ వివాదం ఓ వైప

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (18:34 IST)
టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై ఆతని భార్య హసీన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంతో షమీ కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేసింది. ఇంకా పోలీసులు కూడా షమీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. షమీ వివాదం ఓ వైపు నడుస్తుండగా.. మరోవైపు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌ సర్కార్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 
 
ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం అప్పట్లో బీసీసీఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్‌తో పాటు మహేంద్రసింగ్ ధోని, కోచ్ గ్యారీ కిరిస్టన్‌కి ఇష్టంలేదని వారు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, తమిళనాడుకి చెందిన బద్రీనాథ్‌ని జట్టులోకి తీసుకోవాలని పట్టుబట్టినట్లు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ మీడియాతో చెప్పారు. వారి ప్రతిపాదనను పక్కనబెట్టి కోహ్లీకి అవకాశం ఇవ్వడంతోనే తనను చీఫ్ సెలక్టర్ పదవి నుంచి శ్రీనివాసన్ అప్పట్లో తప్పించాడని వెంగ్ సర్కార్ ఆరోపించాడు. 
 
దీనిపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ స్పందించాడు. కోహ్లీని భారత జట్టులోకి 2008లో ఎంపిక చేయడాన్ని తాను వ్యతిరేకించిన మాటలో నిజం లేదని శ్రీనివాసరన్ అన్నాడు. అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని వెంగ్ సర్కార్ ప్రస్తావించడం సంస్కారం కాదన్నాడు. జట్టు ఎంపికలో తాను జోక్యం చేసుకోలేదని.. వెంగ్ సర్కార్ ఆరోపణల్లో నిజం లేదని శ్రీనివాసన్ కొట్టిపారేశాడు. 
 
అప్పట్లో అతను ముంబయి క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా వెళ్లేందుకు ఆసక్తి కనబర్చాడు. అందుకే అతడ్ని సెలక్షన్ కమిటీలోకి తీసుకోలేదు. బద్రీనాథ్‌ని పక్కన పెట్టడం వల్లే పదవి పోయిందని చెప్తున్న వెంగ్ సర్కార్ మరో విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నాడు. శ్రీలంక పర్యటన కోసం విరాట్ కోహ్లితో పాటు బద్రీనాథ్‌ని కూడా సెలక్టర్లు ఎంపిక చేసిన విషయాన్ని వెంగ్ సర్కారు మరిచిపోయినట్లున్నాడని శ్రీనివాసన్ దెప్పిపొడిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

తర్వాతి కథనం
Show comments