Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు బ్యాట్స్‌మెన్ల సెంచరీలు.. బంగ్లాదేశ్ ఘోర పరాజయం

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్స్ ఏకంగా సెంచరీలు చేశారు. దీంతో క్రికెట్ పసికూన బంగ్లాదేశ్‌పై అరుదైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం 12

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (09:57 IST)
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్స్ ఏకంగా సెంచరీలు చేశారు. దీంతో క్రికెట్ పసికూన బంగ్లాదేశ్‌పై అరుదైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం 128 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డుగా చరిత్రపుటలకెక్కింది.
 
బ్లోయెంఫోంటెయిన్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 254 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఈ స్థాయి ఘన విజయం సాధించడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కాగా, 2001లో శ్రీలంకపై ఇన్నింగ్స్ 229 పరుగుల తేడాతో విజయం సాధించగా ఇప్పుడు దానిని తిరగరాసింది. తాజా విజయం  ఆ దేశ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్దది.
 
ఈ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 573 పరుగులు చేసింది. జట్టులో డీన్ ఎల్గర్ (113), అయిడెన్ మార్కరమ్ (143), హషీం ఆమ్లా (132), ఫా డుప్లెసిస్ (135) సెంచరీలు చేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments