Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగూలీ త్యాగం ధోనీకి వరం .. ఏంటది?

ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టులో గొప్ప ఫినిషర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పేరు గడించారు. ధోనీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎవరున్నారనే అంశాన్ని డీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బహిర్గతం చేశ

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (07:49 IST)
ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టులో గొప్ప ఫినిషర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పేరు గడించారు. ధోనీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎవరున్నారనే అంశాన్ని డీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బహిర్గతం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... సౌరవ్ గంగూలీ తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయకపోతే మహీ ఇంతలా ఎదిగేవాడు కాదన్నారు. ప్రస్తుతం ధోనీ అనుభవిస్తున్న పేరు ప్రఖ్యాతులకు దాదాయే కారణమన్నాడు. ఆ సమయంలో మేం బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయాలని అనుకున్నాం. ఓపెనింగ్‌లో మంచి భాగస్వామ్యం వస్తే మూడో నంబర్‌లో గంగూలీ బ్యాటింగ్‌కు రావాలి. ఒకవేళ మంచి ఆరంభం లభించకపోతే ఫించ్ హిట్టర్‌గా ఇర్ఫాన్ లేదా ధోనీలలో ఒకర్ని పంపి స్కోరు పెంచాలన్నది లక్ష్యం. 
 
చాలాసార్లు ఓపెనింగ్ విఫలంకావడంతో దాదా.. ధోనీని మూడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపాడు. గంగూలీ గనుక ఆ అవకాశం ఇవ్వకపోతే ధోనీ ఇంత గొప్ప ప్లేయర్ కాకపోయేవాడు అని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనీని ప్రమోట్ చేయాలన్నది పూర్తిగా గంగూలీ నిర్ణయమేనని స్పష్టం చేశాడు. ఇలాంటి గొప్ప నిర్ణయాలు చాలా తక్కువ మంది కెప్టెన్లు తీసుకుంటారని ప్రశంసించాడు. కొత్త ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నది గంగూలీ నమ్మిన సిద్ధాంతమని వీరూ చెప్పాడు. 
 
మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో ధోనీని మూడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని గంగూలీ నిర్ణయించుకున్నాడు. ముందుగా తన ఓపెనింగ్ స్థానాన్ని నాకు ఇచ్చాడు. ఆ తర్వాత ధోనీని ప్రమోట్ చేశాడు. ఏ కెప్టెన్ ఇంత ధైర్యం చేయరు. కానీ దాదా చేశాడు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతోనే ధోనీని ముందుకు తీసుకొచ్చాడు. అదే మహీ పాలిట వరంగా మారింది. ఇప్పుడు ఇంత గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు సెహ్వాగ్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments