రాంచీ తొలి టీ-20: కోహ్లీ బుల్లెట్ థ్రో అదుర్స్.. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 పోరులో మైదానంలో కోహ్లీ పాదరసంలా కదిలాడు. అద్భుత ఫీల్డింగ్‌‌తో అదరగొట్టాడు. తొలి ట్వంటీ-20 పోరులో భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్‌లో డాన్ క్రిస్టియన్ షాట్ కొట్టగా, మిడ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (15:55 IST)
రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన  ట్వంటీ-20 పోరులో మైదానంలో కోహ్లీ పాదరసంలా కదిలాడు. అద్భుత ఫీల్డింగ్‌‌తో అదరగొట్టాడు. తొలి ట్వంటీ-20 పోరులో భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్‌లో డాన్ క్రిస్టియన్ షాట్ కొట్టగా, మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ, చాలాదూరం నుంచి దాన్ని ఓ బుల్లెట్‌లా వికెట్లపైకి విసిరేయగా, అది డైరెక్టుగా వచ్చి వికెట్లను తాకి డాన్‌ను అవుట్ చేసింది. బంతికోసం వికెట్ల వెనుక చేతులు పెట్టి ఉన్న ధోనీ.. బంతి డైరక్టుగానే వికెట్లను తాకడంతో ఒక్క క్షణం అబ్బురపడిపోయాడు. ఆ వెంటనే సహచరుడిని అభినందించేందుకు ముందుకు కదిలాడు. 
 
బాల్ సూపర్‌గా వచ్చి వికెట్లను తాకిందని సైగ చేస్తూ ధోనీ కదిలిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్‌కి వరుణుడు అడ్డు పడగా, డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం, తగ్గించిన ఓవర్లు, పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా అందుకుని విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లీ విసిరిన 'బుల్లెట్ థ్రో' వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా, వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్‌ పొట్టి ఫార్మాట్‌లోనూ తన ఆధిపత్యాన్ని చూపింది. శనివారం రాత్రి ఇక్కడ జరిగిన తొలి టీ-20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో తొమ్మిది వికెట్లతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సార్, రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తామని రూ.7 కోట్లు తీసుకున్నారు: బాబుకి టీడిపి కార్యకర్త వీడియో

రిపోర్ట్ వచ్చేవరకూ ఆ 2000 కోళ్లను ఎవ్వరూ తినొద్దు

మనిద్దరి మధ్య మా ఆయన అడ్డుగా వున్నాడు, చంపేయ్: ప్రియుడితో వివాహిత

ట్రంప్ మళ్లీ కొత్త మెలిక: మధుమేహం, ఊబకాయం వుంటే వీసా రిజెక్ట్

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

తర్వాతి కథనం
Show comments