Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ కొత్త నిబంధనలు.. ఫేక్ ఫీల్డింగ్.. ధోనీకి శిక్ష తప్పదా?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కష్టాలు తెచ్చిపెట్టేలా వుంది. క్రికెట్‌లో నిబంధనలను కఠినతరం చేస్తూ.. ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇంకా వాటిని

ఐసీసీ కొత్త నిబంధనలు.. ఫేక్ ఫీల్డింగ్.. ధోనీకి శిక్ష తప్పదా?
, శుక్రవారం, 6 అక్టోబరు 2017 (16:56 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కష్టాలు తెచ్చిపెట్టేలా వుంది. క్రికెట్‌లో నిబంధనలను కఠినతరం చేస్తూ.. ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇంకా వాటిని పక్కాగా అమలు చేస్తుంది. అయితే ఫేక్ ఫీల్డింగ్ నిబంధనలు ధోనీని శిక్షకు గురి చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా పండితులు చెప్తున్నారు. 
 
గత నెల 28 నుంచి ఐసీసీ కొత్త నిబంధనలు అమలులోకి రాగా, ఆ మరుసటి రోజే క్వీన్స్ ల్యాండ్‌కు చెందిన ఓ క్రికెటర్, బంతి చేతిలో లేకున్నా, దాన్ని విసిరేస్తున్నట్టు యాక్ట్ చేయగా, ఆ జట్టుపై ఐదు పరుగుల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో సాధారణంగా కీపింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న సమయంలో దూరం నుంచి వచ్చే బంతిని ధోనీ తన చేతులతో అడ్డుకుంటాడు. దాన్ని వికెట్లపైకి నెడుతాడు. కానీ ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం.. ధోనీ అలాంటి బంతిని అందుకోవడంలో విఫలమై, ఖాళీ చేతులను వికెట్లవైపు చూపిస్తే, శిక్ష ఖాయమవుతుంది. అది ఫేక్ ఫీల్డింగ్ కిందకే వస్తుంది. 
 
అయితే ఐసీసీ కొత్త నిబంధనలపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఫైర్ అయ్యారు. ఫేక్ ఫీల్డింగ్ మోసం కాబోదని.. అదో ట్రిక్ అని కొత్త నిబంధనలో ఫేక్ ఫీల్డింగ్‌పై పెనాల్టీని విధించడం సబబు కాదన్నారు. ఈ నిబంధనను మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీని అనుకరిస్తూ డాన్స్ చేసిన 'శ్యామ్‌'.. వీడియో వైరల్