Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీని అనుకరిస్తూ డాన్స్ చేసిన 'శ్యామ్‌'.. వీడియో వైరల్

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం పని చేసినా అది సంచలనమే. పైగా, అలాంటి పనులు చేయడం ఆయనకే చెల్లుతుంది. తాజాగా ధోనీ డాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ధోనీని అనుకరిస్తూ డాన్స్ చేసిన 'శ్యామ్‌'.. వీడియో వైరల్
, శుక్రవారం, 6 అక్టోబరు 2017 (13:13 IST)
భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం పని చేసినా అది సంచలనమే. పైగా, అలాంటి పనులు చేయడం ఆయనకే చెల్లుతుంది. తాజాగా ధోనీ డాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ డాన్స్ చేసింది కూడా శ్యామ్‌తో కలిసి. సాధారణంగా మైదానంలోనే కాకుండా, మైదానం వెలుపల కూడా ధోనీ ఎంతో కూల్‌గా ఉంటాడు. ఇతగాడికి పెంపుడు జంతువులన్నా, మోటార్ బైక్‌లన్న అమితమైన ఇష్టం. 
 
ఈ విషయం మరోమారు ఇపుడు నిరూపితమైంది. త‌మ పెంపుడు కుక్క 'శామ్‌'తో ధోనీ ఆడుతున్న వీడియోను ఆయ‌న భార్య సాక్షి త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. 'బెల్జియ‌న్ మాలినోయిస్ జాతికి చెందిన శామ్ అనుక‌రించే టాలెంట్' అని సాక్షి పోస్ట్ రాసింది. ఆమె చెప్పిన‌ట్లుగానే ఈ వీడియోలో ధోనీని శామ్ అనుక‌రించ‌డం చూడొచ్చు. ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ విజ‌యం త‌ర్వాత ఇంట్లో సేద‌తీరుతున్న ధోనీ ఇటీవ‌ల త‌మ ఇంటికి బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టీవ్ స్మిత్‌కు గాయం.. ఆందోళనలో ఆస్ట్రేలియా?