సిక్స్‌ల రారాజు రోహిత్ శర్మ... కెరీర్‌లో 167 వన్డేల్లో మొత్తం 141 సిక్సర్లు
క్రీజులో కాసేపు నిలదొక్కుకుంటే చాలు భారీ షాట్లతో అలరించే భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ గురువారం ఆస్ట్రేలియాపై జరిగిన నాలుగో వన్డేలో ఐదు సిక్సర్లను బాది అరుదైన ఘనత సాధించాడు.
క్రీజులో కాసేపు నిలదొక్కుకుంటే చాలు భారీ షాట్లతో అలరించే భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ గురువారం ఆస్ట్రేలియాపై జరిగిన నాలుగో వన్డేలో ఐదు సిక్సర్లను బాది అరుదైన ఘనత సాధించాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందు వరకు తన కెరీర్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన అన్ని వన్డేల్లో కలిపి రోహిత్ శర్మ 48 సిక్సులు కొట్టాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో 49వ సిక్సుని కొట్టిన రోహిత్ శర్మ అనంతరం కొద్ది సేపటికే కానె రిచర్డ్ సన్ బౌలింగ్‌లో మరో సిక్సుని కొట్టి ఆసీస్‌పై 50 సిక్సులు కొట్టిన అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.
కమిన్స్, రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ కొట్టిన అనంతరం, ఆడమ్ జంపా బౌలింగ్‌లో రెండు, ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో ఒక సిక్సుని కొట్టి ఆస్ట్రేలియా జట్టుపై రోహిత్ శర్మ మొత్తం 53 సిక్సులు నమోదు చేసుకున్నాడు. మొత్తానికి రోహిత్ శర్మ తన కెరీర్‌లో 167 వన్డేలు ఆడగా అందులో మొత్తం 141 సిక్సర్లు కొట్టాడు.
కాగా, ఏదైనా ఓ ప్రత్యర్థి జట్టుపై 50 సిక్సులు కొట్టిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ కంటే ముందు సనత్ జయసూర్య (శ్రీలంక), షాహిద్ అఫ్రిదీ (పాకిస్థాన్) ఉన్నారు. జయసూర్య తన కెరీర్‌లో టీమిండియాపై మొత్తం 53 సిక్సులు కొట్టగా, అఫ్రిదీ తన కెరీర్‌లో మూడు జట్లపై 50 కన్నా ఎక్కువ సిక్సులు కొట్టాడు. శ్రీలంకపై అఫ్రిది 63 సిక్సులు కొట్టగా, టీమిండియాపై 51, న్యూజిలాండ్‌పై 50 సిక్సులు కొట్టాడు.