Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

దేశానికి ఖ్యాతిని తెచ్చిన ఆ క్రీడాకారిణిని అలా అవమానించారు.. ఏం చేసిందంటే..

పారా ఒలింపిక్స్ వీల్ చైర్ టెన్నిస్ క్రీడాకారిణి మధుబగ్రీకి రేణిగుంట విమానాశ్రయంలో అవమానం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చిన మధు బగ్రి స్వామి దర్శనం తర్వాత తిరుగుపయనమవ

Advertiesment
Para-tennis player Madhu Bagri ill-treated
, మంగళవారం, 15 ఆగస్టు 2017 (14:51 IST)
పారా ఒలింపిక్స్ వీల్ చైర్ టెన్నిస్ క్రీడాకారిణి మధుబగ్రీకి రేణిగుంట విమానాశ్రయంలో అవమానం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చిన మధు బగ్రి స్వామి దర్శనం తర్వాత తిరుగుపయనమవడానికి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో వెళ్ళేందుకు టిక్కెట్టును కొనుగోలు చేశారు. పారా ఒలింపిక్స్ క్రీడాకారిణి కావడంతో ఆమెకు ఒక వీల్ ఛైర్‌ను ఏర్పాటు చేశారు విమానాశ్రయ సిబ్బంది.
 
అయితే వీల్ ఛైర్‌లో ఉన్న టెన్నిస్ క్రీడాకారిణికి మూడో నెంబర్ సీటిచ్చారు. ఆ సీటు తనకు అనూకూలంగా ఉండదని, మొదటి సీటు కేటాయించమని మధు బగ్రి కోరింది. అయితే అందుకు సిబ్బంది ససేమిరా అనడంతో పాటు మధు బగ్రిని అవమానకరంగా మాట్లాడుతూ కిందకు దించేశారు. వికలాంగురాలినని కూడా చూడకుండా చాలా హీనంగా తనతో మాట్లాడడానకి మధు బగ్రి తన ఫోన్ ద్వారా వాట్సాప్‌కు మీడియాకు ఒక వీడియోను పంపించారు. 
 
దేశానికి ఖ్యాతి తెచ్చి పెట్టే తనలాంటి క్రీడాకారిణికి గౌరవం ఇవ్వని విమానాశ్రయ సిబ్బంది, కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఇస్తున్నారని వాపోయింది. తనను హేళనగా మాట్లాడి చివరకు క్షమాపణ చెప్పలేదని, విమానం నుంచి కిందకు బలవంతంగా దించేశారని మధు బగ్రి ఆరోపించింది. అయితే మధు బగ్రి వ్యాఖ్యలను విమానాశ్రయ సిబ్బంది కొట్టిపారేశారు. మధు బగ్రి అడిగిన సీటు అత్యవసర సమయంలో వాడేదని, అలాంటప్పుడు ఆమెను ఎలా కూర్చోబెడతామని వివరణ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్రాంతి పేరుతో యువరాజ్‌ ఔట్... నెక్ట్స్ టార్గెట్ ధోనీయేనా?