Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ ర్యాంకింగ్స్ : 887 పాయింట్లతో కోహ్లీ నెం.1

ఐసీసీ వెల్లడించిన ర్యాంకింగ్స్ పట్టికలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మొత్తం 887 పాయింట్లను కైవసం చేసుకున్న కోహ్లీ... మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మ‌రోవైపు

Advertiesment
ఐసీసీ ర్యాంకింగ్స్ : 887 పాయింట్లతో కోహ్లీ నెం.1
, మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (09:21 IST)
ఐసీసీ వెల్లడించిన ర్యాంకింగ్స్ పట్టికలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మొత్తం 887 పాయింట్లను కైవసం చేసుకున్న కోహ్లీ... మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మ‌రోవైపు టీ20ల్లోనూ కోహ్లీ నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 
 
కాగా, బౌలర్స్ ర్యాంక్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా 27 స్థానాలు ఎగబాకి 687 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇది ఆయ‌న కెరీర్‌‌లోనే బెస్ట్ ర్యాంక్. ఇక జట్టు పరంగా తీసుకుంటే భారత్ త‌న మూడ‌వ స్థానాన్ని నిల‌బెట్టుకుంది.  
 
ఐసీసీ వ‌న్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌..
టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీ (887 పాయింట్లు)- నెం.1
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (861)- నెం.2
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్ (847)- నెం.3
ఇంగ్లాండ్ సార‌థి జో రూట్ (799) - నెం.4
పాకిస్థాన్ ఓపెనర్ బాబర్ అజామ్ (786) - నెం.5
 
ఐసీసీ వ‌న్డే ‌జట్ల ర్యాంకింగ్స్‌..  
ద‌క్షిణాఫ్రికా (119)- నెం.1
ఆస్ట్రేలియా  (117)- నెం.2
ఇండియా (117 )- నెం.3
ఇంగ్లాండ్ (113)- నెం.4
న్యూజిలాండ్ (111)- నెం.5 
 
ఐసీసీ వ‌న్డే బౌల‌ర్స్‌ ర్యాంకింగ్స్‌..  
ఆస్ట్రేలియా పేసర్ హేజిల్ వుడ్ (732)- నెం.1
దక్షిణాఫ్రికా స్పిన్నర్ తాహిర్ (718)- నెం.2
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (701)- నెం.3
జస్‌ప్రీత్ బుమ్రా (687)- నెం.4
దక్షిణాఫ్రికా యువ బౌలర్ రబాడ్‌ (685)- నెం.5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#IHATEMYTEACHER : ఐ హేట్ మై టీచర్ అంటున్న పీవీ సింధు (Video)