Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌కు భారత్ చేతిలో క్లీన్ స్వీప్ తప్పదనుకుంటా?: సౌరవ్ గంగూలీ ధీమా

భారత్‌లో పర్యటన చేపట్టిన ఇంగ్లండ్‌కు భారత్ చేతిలో ఘోర పరాభవం తప్పదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. టీమిండియా ప్రస్తుత ఫామ్‌పై గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే.. ఐదు టెస్టు

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (18:07 IST)
భారత్‌లో పర్యటన చేపట్టిన ఇంగ్లండ్‌కు భారత్ చేతిలో ఘోర పరాభవం తప్పదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. టీమిండియా ప్రస్తుత ఫామ్‌పై గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే.. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేస్తారని గంగూలీ వ్యాఖ్యానించాడు. బంగ్లా పర్యటనలో టెస్టు క్రికెట్‌లో విఫలమై.. ప్రస్తుతం టీమిండియాతో బరిలోకి దిగనున్న ఇంగ్లండ్ తీవ్రంగా శ్రమించే అవకాశం ఉందని గంగూలీ చెప్పాడు. 
 
కానీ న్యూజిలాండ్ మాదిరే ఇంగ్లండ్‌ను కూడా వైట్ వాష్ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌తో చివరి టెస్టులో ఓటమిపాలైన విషయాన్ని మనసులోంచి తీసివేయాలని చెప్పాడు. భారత జట్టులో అశ్విన్, జడేజాలాంటి స్పిన్నర్లు ఉన్నారన్న విషయం గురించి మరిచిపోవాలని.. సహజసిద్ధంగా ఆడితే ఇంగ్లండ్‌కు విజయం ఖాయమన్నాడు. సొంతగడ్డపై భారత్ మెరుగ్గా ఆడే అవకాశం ఉన్నందున ఒత్తిడికి లోనుకాకూడదని వాన్ ఆటగాళ్లకు సూచించాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments