Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్ వన్డేలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. భారత్ అద్భుత విజయం

ఠాగూర్
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (22:28 IST)
నాగ్‌పూర్ వన్డేలో పర్యాటక ఇంగ్లండ్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో స్వాధీనం చేసుకున్న భారత్.. గురువారం జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. 249 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... నాలుగు వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కేవలం 38.4 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. 
 
భారత ఆటగాళ్లలో వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 96 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 87 పరుగులతో చెలరేగిపోయాడు. ఓ వైపు కండరాల నొప్పి వెంటాడుతున్నా.. అద్భుత పోరాటం చేశాడు. అక్షర్‌ పటేల్‌ 47 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 52, శ్రేయస్‌ అయ్యర్‌ 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 59 అర్థశతకాలు సాధించారు. ఓపెనర్లు జైస్వాల్‌ (15), రోహిత్‌ శర్మ (2) నిరాశ పరిచారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌, మహమూద్‌, బెతెల్‌, రషీద్‌ తలో వికెట్‌ తీశారు.
 
నాగ్‌పూర్ వన్డే మ్యాచ్ : రాణించిన బౌలర్లు - ఇంగ్లండ్ 248 ఆలౌట్
 
నాగ్‌పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌‍లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లీష్ ఆటగాళ్లు పరుగులు సాధించడంలో తడబాటుకు గురయ్యారు. 
 
ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌ బట్లర్‌ 67 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేయగా, బెతెల్‌ 64 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 51 చొప్పున పరుగులు చేశారు. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ 26 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్‌ల సాయంతో 43 మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ ప్రారంభించినప్పటికీ.. సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. 
 
మరో ఓపెనర్‌ డకెట్‌ (32; 29 బంతుల్లో 6×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. అరంగేట్ర బౌలర్‌ హర్షిత్‌ రాణా తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. జడేజా మూడు వికెట్లు తీయగా అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు.
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత క్రికెట్ జట్టు 22.3 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ జైశ్వాల్ 15, రోహిత్ శర్మ 2, శ్రేయాస్ అయ్యర్ 59 చొప్పున పరుగులు చేసి ఔట్ కాగా, గిల్ 42, అక్సర్ పటేల్ 25 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments