Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగి పోర్న్ స్టార్‌ చెంప చెళ్లుమనిపించిన మాజీ క్రికెటర్!

ఆయనో క్రికెట్ లెజెండ్. ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న క్రికెటర్. అయితే, పోకిరి చేష్టలకేం తక్కువేం లేదు. ఆయన చేసే చేష్టలు అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా మద్యం సేవించి

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (16:43 IST)
ఆయనో క్రికెట్ లెజెండ్. ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న క్రికెటర్. అయితే, పోకిరి చేష్టలకేం తక్కువేం లేదు. ఆయన చేసే చేష్టలు అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా మద్యం సేవించి ఓ శృంగార తారపై చేయి చేసుకున్న సంఘటన లండన్ నైట్ క్లబ్‌లో జరిగింది. 
 
శృంగార తార వేలెరీ ఫాక్స్ ముఖంపై షేన్ వార్న్ కొట్టడంతో ఆమె కన్ను వాచిపోయింది. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫాక్స్, షేన్ వార్న్‌పై మండిపడుతూ వ్యాఖ్యలు చేసింది. 'ఓ మహిళపై చేయి చేసుకుని గర్వంగా ఫీలవుతున్నావా? నువ్వు ఎంత పేరుపొందిన వ్యక్తివి అయితే మాత్రం ఓ మహిళను కొట్టి తప్పించుకుందామని అనుకుంటున్నావా?..' అంటూ ఆమె మండిపడింది. 
 
కాగా, ఈ సంఘటనపై ప్రత్యక్షసాక్షులు స్పందిస్తూ, ఫాక్స్‌ను షేన్ వార్న్ కొట్టగానే ఆమె కిందపడిపోయిందని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. వెస్ట్ మినిస్టర్‌లోని హెర్ట్ ఫోర్డ్ స్ట్రీట్‌లో ఉన్న ఓ నైట్ క్లబ్‌లో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్టు స్కాట్లాండ్ యార్డు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం