Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ యువ పేసర్‌తో షాహిద్ అఫ్రిది కుమార్తె నిశ్చితార్థం!

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (17:02 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూతురు అక్సాకు త్వరలోనే ఎంగేజ్మెంట్ జరగబోతుంది. పాకిస్థాన్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిదితో ఆమె నిశ్చితార్థం జరగబోతుంది. ఈ విషయాన్ని అఫ్రిది అధికారికంగా వెల్లడించాడు. 
 
తన కూతురిని కోడలిగా చేసుకోవాలనే ఆలోచనను షాహీన్ కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి తెలిపారు. రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉన్నాయి. పెళ్లిలు స్వర్గంలో నిర్ణయించబడతాయి. అల్లాహ్ ఆశీస్సులు ఉంటే ఈ పెళ్లి కూడా జరుగుతుంది. మైదానంలోనే కాకుండా జీవితంలో కూడా షాహీన్ విజయవంతంగా కావాలని ప్రార్థిస్తున్నానని అఫ్రిది ట్వీట్ చేశాడు. 
 
ఇక, షాహీన్ తండ్రి అయాజ్ ఖాన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. తన కొడుకు మ్యారేజ్ కోసం అఫ్రిది కుటుంబానికి ప్రతిపాదన పంపినట్టు తెలిపాడు. గత కొన్ని నెలలుగా రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పాడు. త్వరలోనే తేదీలను ఖరారు చేయనున్నట్టు తెలిపాడు. ఇక, ఇటీవల జరిగిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో అఫ్రిదితో కలిసి షహీన్‌ ఆడారు.
 
ఇక, 20 ఏళ్ల షాహీన్ పాకిస్తాన్‌ టీమ్‌లో ప్రధాన పేస్ బౌలర్‌గా ఉన్నాడు. అన్ని ఫార్మాట్‌లలో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు 15 టెస్టులు, 20 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 48, వన్డేల్లో 45, టీ20లో 24 వికెట్లు తీశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments